అపాచీ పరిశ్రమతో రెండు వేల మందికి ఉపాధి: ముఖ్యమంత్రి

వార్తలు
1,070 Views

పులివెందులలో అపాచీ పరిశ్రమకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం శంకుస్థాపన చేసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా అపాచీ ప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. రూ.70 కోట్లతో రెండు దశలలో ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమ ద్వారా రెండు వేల మందికి ఉపాధి దొరకనుంది. 27.94 ఎకరాల స్థలంలో ఈ పరిశ్రమను నెలకొల్పనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ…. ఆంధ్ర ప్రదేశ్, తైవాన్ ప్రభుత్వం కలిసి నేడు అడుగులు వేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 2006లో దివంగత నేత వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తడలో 11 వేల మందికి ఉపాధి కల్పిస్తూ… 150 మిలియన్ యుఎస్ డాలర్ల పెట్టుబడితో ఒక కోటి 80 లక్షల జతల షూస్ ను తయారు చేసే వ్యవస్థను నెలకొల్పినట్లు చెప్పారు. కంపెనీని విస్తరించడంలో భాగంగా పులివెందులలో రెండవ యూనిట్ ను పది మిలియన్ డాలర్ల పెట్టుబడితో స్థాపించడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఈ పరిశ్రమ ద్వారా రెండు వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఇందులో 50, 60 శాతం మంది ఆడవాళ్లకు.. అక్కచెల్లెమ్మలే ఇక్కడ ఉద్యోగులుగా ఉంటారన్నారు. ఇక్కడ పరిశ్రమ పెట్టడమే కాకుండా శ్రీకాళహస్తిలో కూడా అపాచీ సంస్థకు కేటాయించడం జరిగింది. రూ.350 కోట్ల రూపాయలతో మొదటి దశ కింద అక్కడ కూడా ఒక పార్టీ పెట్టడం జరుతోందని, దాదాపు ఐదు వేల మందికి అక్కడ కూడా ఉద్యోగావకాశాలు కల్పించడానికి ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. పరిశ్రమకు పులివెందులలో దాదాపు ఇరవై ఎనిమిది ఎకరాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రం… పెట్టుబడులను ఆకర్షించేలా క్రియాశీలక పాత్ర చర్యలు చేపట్టడంలో భాగంగా దేశంలోనే నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా ఉందని సీఎం తెలిపారు. ఆంధ్ర రాష్ట్రం బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ అమలు ర్యాంకింగ్ లో భారత ప్రభుత్వము, వరల్డ్ బ్యాంకు సంయుక్తంగా కలిసి… భారతదేశ ర్యాంకింగ్ లకు సంబంధించి సెప్టెంబరు మాసంలో నివేదిక విడుదల చేశారని… అందులో పరిశ్రమలు స్థాపించిన వారితో అందరిని అడిగి, వాళ్ళ అందరి అభిప్రాయాలు సర్వేలలో క్రోడీకరించి దేశం మొత్తం మీద ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టిన వారందరూ సంతృప్తి గా ఉన్నారని 100% వెయిటేజినిస్తూ దేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని ఉత్తమ రాష్ట్రంగా గుర్తించడం జరిగిందన్నారు. మనస్ఫూర్తిగా ఈ పరిశ్రమ వాళ్లకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని, నా తరపున, నాకు కుటుంబ సభ్యులుగా ఉన్న మీ అందరి తరఫున మాట ఇస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో అపాచీ పరిశ్రమలు నెలకొల్పడానికి ముందుకు వచ్చినందుకు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ కు, తైపే డైరెక్టర్ జనరల్ కు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రానికి ముందుకు వస్తున్నారని చెప్పడానికి ఈ పరిశ్రమే నిదర్శనమని, తాను జన్మించిన పులివెందులకు వచ్చినందుకు… అపాచికంపెనీ ప్రతినిధులను ముఖ్యమంత్రి అభినందించారు.
కార్యక్రమంలో అపాచీ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ జాన్సన్ చాంగ్, తైపే డైరెక్టర్ జనరల్ బెన్ వాంగ్ లు మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అపాచీ ఫుట్‌వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ కొత్త కర్మాగారాన్ని నేడు నెలకొల్పడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్ మోహన్ రెడ్డి ఆహ్వానించిన మేరకు పరిశ్రమ స్థాపించటం జరిగిందన్నారు. తైవాన్ వ్యాపారవేత్తలకు భారతదేశం ఇప్పటికీ అనుకూలమైన గమ్యస్థానమని వారు పేర్కొన్నారు. అపాచీ ఫుట్వేర్ కంపెనీ కొత్త ప్లాంట్ను నెలకొల్పడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో తమ కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయించిందన్నారు. ఈ విస్తరణతో.. 1.8 మిలియన్ జతల స్పోర్ట్ షూస్ ఉత్పత్తి శ్రేణిని అంచనా వేస్తున్నామని, మరియు అదనంగా 15 వేల ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉందన్నారు. తైవాన్-ఇండియా ఆర్థిక సంబంధాల నిరంతర వృద్ధికి భరోసా ఇచ్చే విధంగా అపాచీ పాదరక్షల విస్తరణ యూనిట్ ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవడం పట్ల మిస్టర్ వాంగ్ ప్రశంసించారు. అపాచీ ఫుట్వేర్ డైరెక్టర్ జనరల్ చాంగ్ మాట్లాడుతూ… భారతదేశంలో తన కంపెనీకి నిరంతరం పెట్టుబడులు పెట్టడానికి సంభావ్య మార్కెట్‌గా ఉందన్నారు. అపాచీ పాదరక్షల విస్తరణకు సిఎం స్వాగతం పలకడంతో… రాష్ట్రంలో ఎక్కువ ఉపాధిని సృష్టిస్తుందని, నివాసితుల జీవనోపాధి మెరుగుదలకు దోహదపడే అవకాశం ఉందని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం యజమాని-ఉద్యోగుల సంబంధానికి మంచి ప్రాధాన్యత ఇస్తుందని ఆయన నొక్కి చెప్పారు. వచ్చే ఏడాది తైవాన్ సందర్శించడానికి సిఎం జగన్ మోహన్ రెడ్డిని వారు ఆహ్వానించారు. ఈ యాత్ర రెండు వైపుల మధ్య పరిచయాన్ని మరియు స్నేహాన్ని పెంపొందించడానికి సహాయపడుతుందని మరియు తైవాన్ నుండి మరిన్ని పెట్టుబడులను స్వాగతించడానికి మరియు ప్రోత్సహించడానికి ఒక వారధిలా పరిగణించబడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏపీఐఐసి వీసీ అండ్ ఎండి రవీణ్ కుమార్ రెడ్డి, అపాచీ లెదర్ ఇండస్ట్రీకి సంబంధించి… ఇంటెలిజెంట్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ జాన్సన్ చాంగ్ లు ముఖ్యమంత్రి సమక్షంలో అపాచీ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి సంబంధించి ఎంఓయు మార్చుకున్నారు.*
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఎస్ బి అంజద్ భాష, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్ కె రోజా, ఇండస్ట్రియల్ మరియు కామర్స్ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కరికాలవలవన్, ఏపీఐఐసి వీసీ అండ్ ఎండి రవీణ్ కుమార్ రెడ్డి, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జెవిఎన్ సుబ్రమణ్యం, జిల్లా కలెక్టర్ సి. హరికిరణ్, పరిశ్రమల శాఖ అడ్వైజర్ రాజోలి వీరారెడ్డి, జాయింట్ కలెక్టర్ ధర్మ చంద్రారెడ్డి, అపాచీ లెదర్ ఇండస్ట్రీకి సంబంధించి… ఇంటెలిజెంట్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ జాన్సన్ చాంగ్, తైపే ఎకనామిక్ కల్చర్ సెంటర్ డైరెక్టర్ జనరల్ బెన్ వాంగ్, అపాచీ గ్రూప్ జనరల్ మేనేజర్ గవిన్ చాంగ్, వీజీఎం ముత్తు గోవింద స్వామి, వైస్ ప్రెసిడెంట్ సైమన్ చెంగ్, డైరెక్టర్లు సీన్ చెన్, హరియెట్లీ త

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *