స్వచ్ఛ సిటీ తిరుపతి -2018 ప్రతిష్టాత్మక అవార్డును పూర్వపు కమీషనర్, ప్రస్తుత కడప జిల్లా కలెక్టర్ శ్రీ చెవ్వూరు హరికిరణ్ అందుకున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో అవార్డును అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ భారత్, స్వచ్ఛ సర్వేక్షన్ ఆధ్వర్యంలో ఘన వ్యర్థాల నిర్వహణలో చేసిన కృషికి అవార్డు దక్కింది. చిత్తూరు జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న, తిరుపతి కార్పోరేషన్ కమీషనర్ విజయరామ రాజులుతో కలసి అవార్డును అందుకున్నారు. తిరుపతి నగరపాలక సంస్థకు సంబంధించి తుడా వైస్ ఛైర్మన్ గా అభివృద్ధి లో తనదైన ముద్ర వేసి గౌరవాన్ని దక్కించుకున్నారు.