ఆఫ్ఘనిస్తాన్ లో కారుబాంబు: 24 మంది మృతి, 60 మందికి గాయాలు

ఆఫ్ఘ‌నిస్థాన్‌లో మ‌రోసారి భారీ పేలుడు సంభ‌వించింది. దక్షిణ ఆఫ్ఘనిస్థాన్‌లోని లష్కర్‌ గాహ్‌ సిటీలో ఓ బ్యాంక్‌ వద్ద కారు బాంబు పేలడంతో 24 మంది పౌరులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మరో 60 మందికి గాయాలు కాగా వారిని స‌హాయ‌క సిబ్బంది ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఆ బ్యాంకులో మిలటరీ ప్రభుత్వ ఉద్యోగులు, పౌరులు తమ వేత‌నాల‌ను విత్‌డ్రా చేసుకునేందుకు క్యూలో నిలబడ్డారు. ఇదే స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ దాడి ఏ ఉగ్రవాద సంస్థ చేసిందో ఇంకా తెలియ‌రాలేదు.

June 22, 2017

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *