ysrkadapa

వార్తలు

ఉక్కు పరిశ్రమను స్థాపించే బాధ్యత నాదే

కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ వస్తుంది. స్థాపించే బాధ్యత నాదేనంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని కోరుతూ 11రోజులుగా ఆమరణదీక్ష చేస్తున్న ఎంపీ రమేష్‌ను పరామర్శించారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి నాలుగు ప్రతిపాదనలను లేవనెత్తారు. కేంద్ర ప్రభుత్వమే ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తే పూర్తిగా సహకరిస్తామన్నారు. నష్టమని మీనవేషాలు లెక్కిస్తే 50శాతం పెట్టుబడులు పెట్టండి,రాష్ట్రం 50శాతం పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మూడో మార్గం మనం పరిశ్రమను ఏర్పాటు చేసుకోవడమేనన్నారు. కేంద్రం ద్వారా ఏర్పాటు చేయించుకోలేక పోతే మన హక్కును కోల్పోయినట్లేనన్నారు. హక్కు కోల్పోతే కేంద్రంపై ప్రజలు విశ్వాసం కోల్పోతారన్నారు. ప్రైవేట్‌ వ్యక్తులను తేవాలన్నా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. మేజర్‌ మినరల్‌ రూల్స్‌ నిబంధనలు అడ్డువస్తాయని దీన్ని  కేంద్రం సవరించాల్సి ఉంటుందన్నారు. కమిటీని ఏర్పాటు చేసి చర్చిస్తూనే పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. పార్లమెంట్‌లో నిలదీసినా స్పందించకపోతే ప్రభుత్వమే పరిశ్రమను ఏర్పాటు చేసి మీ రుణం తీర్చుకుంటుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. సీఎం రమేష్‌ దీక్షను విరమింపజేశారు.

Leave a Comment