ఓటుకు నోటివ్వం: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో పార్టీ కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ, కొందరు అవినీతి డబ్బును ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారని వైఎస్సార్సీపీని ఉద్దేశించి పేర్కొన్నారు. గెలిచిన తరువాత మళ్లీ అవినీతికి పాల్పడి ఖర్చు చేసిన దానికి రెట్టింపు సంపాదిస్తున్నారని మండిపడ్డారు. తాను కూడా ఒక్కో ఓటుకు 5 వేల రూపాయలు ఇవ్వగలనని అన్నారు.

ఒకవేళ అలా ఇస్తే మళ్లీ అవినీతికి పాల్పడాల్సి వస్తుందని, అలాంటి పని తాను చేయనని అన్నారు. కొందరు తానిచ్చిన పెన్షన్ తింటున్నారని ఆయన చెప్పారు. తాను వేసిన రోడ్ల మీదే నడుస్తున్నారని ఆయన చెప్పారు. కానీ నాకు ఓటు వేయనంటే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. తన పాలన నచ్చకపోతే తానిచ్చే పెన్షన్లు తీసుకోవద్దని, తానేసిన రోడ్లపై నడవవద్దని ఆయన సూచించారు. అలాగే తనకు ఓట్లు వేయని గ్రామాలను అవసరమైతే పక్కన పెడతానని ఆయన షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

June 22, 2017

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *