ఉక్కు పరిశ్రమ సాధనకోసం రాజ్య సభ్యుడు సిఎం రమేష్ కడపలో తలపెట్టిన కోసం ఆమరణ నిరాహార దీక్షల కోసం  ఎర్రగుంట్ల మండలం పొట్ల దుర్తి నుంచి కార్యకర్తలతో బయలుదేరారు. ఈయన వెంట తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఉన్నారు. ప్రత్యేక పూజల అనంతరం ఆయన కడపకు బయలుదేరారు.