రాష్ట్రంలో కడప జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. జిల్లా సరిహద్దులు తెలుగు జిల్లాలు కావడమే. రాష్ట్రంలో కడప జిల్లా తరహా ఉండే మరొక జిల్లా వరంగల్ జిల్లా. ఈజిల్లాలపై అన్యభాషల ప్రభావం ఉండదు. స్వచ్ఛమైన తెలుగుభాష ఇక్కడ కనిపిస్తుంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలు ఏది తీసుకున్నా వాటి సరిహద్దుల్లో ఇతర రాష్ట్రాలు కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా,మధ్యప్రదేశ్‌లు ఉన్నాయి. అందువల్ల ఆయా జిల్లాలపై అన్య భాషల ప్రభావం ఉంటుంది. అందువల్ల స్వచ్ఛమైన తెలుగు ఒక కడప, వరంగల్ జిల్లాలోనే లభిస్తుంది.