గ్రామదర్శిని-గ్రామ వికాసం ద్వారా గ్రామాలన్నీ సంపూర్ణ అభివృద్ధి సాధిస్తాయని జిల్లా కలెక్టర్ శ్రీ హరి కిరణ్ అన్నారు. బద్వేలు మండలం అనంతరాజుపురం గ్రామపంచాయతీ పరిధిలోని లక్ష్మీపాలెం, విజయరాంపురం, విజయరాంపురం దళితవాడల్లో అధికారులతో కలెక్టర్ గ్రామదర్శిని నిర్వహించారు. తొలుత లక్ష్మీ పాలెంలో రహదారులను పరిశీలించారు. ఓపెన్‌ డ్రైనేజీ కొరకు ప్రతిపాదనలు పంపించాలని పిఆర్ అధికారులను ఆదేశించారు. గ్రామంలో 120 మీటర్ల దూరం సిమెంట్ రోడ్లు నిర్మించాల్సి ఉందని పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు స్పష్టం చేయగా రోడ్ల మంజూరు కొరకు ఎస్డీఎఫ్, ఎన్ఆర్ఈజీఎస్ కింద ప్రతిపాదనలు పంపాలని డ్వామా పీడీని ఆదేశించారు. అనంతరం గ్రామంలోని హెల్త్ సబ్ సెంటర్ ను పరిశీలించారు. సబ్ సెంటర్ పరిధిలో గర్భిణీలు ఎంతమంది, హై రిస్క్ లో ఉన్న వారు ఎంతమంది, రక్తహీనత కలిగిన వారు ఎంతమంది, పౌష్టికఆహార లోపం ఉన్నవారు ఎంతమంది తదితర వివరాలను హెల్త్ సెంటర్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. హై రిస్క్ లో ఇద్దరు ఉన్నారని, రక్తహీనత ఉన్నవారు ఒకరు ఉన్నారని సిబ్బంది తెలపగా వారికి తగు చర్యలు చేపట్టాలని సూచించారు. పంచాయతీ కార్యాలయ భవనాన్ని సందర్శించారు. సర్పంచ్ల పదవీకాలం అయిపోయి నందున పంచాయతీ కార్యదర్శుల నేమ్ బోర్డులను కార్యాలయంలో ప్రదర్శించాలని సూచించారు. పంచాయతీ భవనం అంగన్వాడికేంద్రం ముందుగల రహదారి బురదతో ఉండడం, నీరు నిల్వ ఉండడం అపరిశుభ్రంగా ఉండడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవోపీఆర్డీ ఉపేంద్ర పనితీరుపై అసంతృప్తి వెలిబుచ్చి అతనికి షోకాజ్ నోటీస్ ఇవ్వాలని ఆదేశించారు. పక్కనే గల అంగన్వాడి కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించి కేంద్రానికి రక్షణగోడ లేకపోవడంతో వెంటనే రక్షణ గోడ నిర్మాణానికి, మరుగుదొడ్లు నిర్మాణానికి, త్రాగునీటికి ప్రతిపాదనలు పంపాలని ఐసిడిఎస్ పిడిని ఆదేశించారు. అనంతరం జెడ్ పి యు పి స్కూల్ ను సందర్శించారు. పిల్లలతో ముఖాముఖి మాట్లాడారు.9 10 తరగతులు లేవని వెంటనే అదనపు తరగతి గదులు నిర్మించాలని, పాఠశాలకు సగం కాంపౌండ్ వాల్ మాత్రమే ఉందని మిగిలిన సగం నిర్మించాలని పిల్లలు కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ పాఠశాల బౌండరీ లైన్ సర్వే చేసి అదనపు తరగతి గదుల నిర్మాణానికి, ప్రహరి గోడ నిర్మాణానికి మంజూరు కొరకు ప్రతిపాదించాలని సూచించారు. అనంతరం గ్రామంలో నిర్మించుకుంటున్న ఎన్టీఆర్ గృహ నిర్మాణాలను పరిశీలించారు. లఆబ్దిదారురాలు అంకమ్మ తో ఇప్పటివరకు ఎంత బిల్లు వచ్చింది ఇంకాఎంత రావాల్సి ఉందని అడుగగా, rc వరకు ఇల్లు నిర్మించుకున్నానని, ఇప్పటివరకు 40 వేల రూపాయలు వచ్చిందని అంకమ్మ తెలిపారు. ఆ ఇంటి నిర్మాణానికి మొత్తంగా ఎంత వస్తుందని సంబంధిత అధికారిని అడిగి తెలుసుకున్నారు. ఇంటికి మొత్తంగా లక్షా 30వేల రూపాయలు వస్తుందని 40000 పోగా మిగిలిన బిల్లులను త్వరగా చెల్లించాలని అధికారులను సూచించారు. గ్రామంలో జెర్రిపోతు జేజమ్మ వాళ్ల ఇంటికి వెళ్లి గ్రామంలో సమస్యలేమైనా ఉన్నాయా వారికి రేషన్ కార్డు ఉందా వారికి పెన్షన్ సక్రమంగా అందుతుందా తదితర వివరాలను తెలుసుకున్నారు. కుమ్మర వీధి లో సీసీ రోడ్డు నిర్మించాలని స్థానికులు కోరగా అక్కడ సిసి రోడ్డు నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు పంపాలని డ్వామా పీడీనీ ఆదేశించారు. గ్రామంలోని చౌక దుకాణాన్ని సందర్శించి ఆ దుకాణం పరధిలో కార్డుదారులు ఎంతమంది, వేలిముద్రలు పడని వారు ఎందరు తదితర వివరాలు డీలరును అడిగి తెలుసుకున్నారు. చౌక దుకాణం పరిధిలో 398 కార్డుదారులు ఉన్నారని, ఇద్దరికీ వేలిముద్రలు పడటంలేదని, 18 మంది రేషన్ తీసుకోవడం లేదని డీలరు తెలిపారు. అనంతరం చెత్త నుండి సంపద తయారుచేయు కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం పంచాయతీ పరిధిలోని గుండంరాజుపల్లె లో నిర్మించిన చెత్త నుండి సంపద తయారుచేయు కేంద్రాన్ని సందర్శించారు. చెత్త సేకరించు ప్రణాళికను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ పరిధిలో 10 హాపీ టేషన్ లు ఉన్నందున ఒక కేంద్రం సరిపోవడంలేదని తెలిపారు. పంచాయతీ ని బట్టి ఎన్ని గ్రామాలలో రెండవ షెడ్డు అవసరమవుతుందో జిల్లా మొత్తం సర్వే చేసి తనకు నివేదిక సమర్పించాలని జిల్లా రిసోర్స్ కోఆర్డినేటర్ జుబేదా ను ఆదేశించారు. అంబేద్కర్ నగర్ లోని ఊసు పల్లి శ్యామల తనకు రేషన్ కార్డు, ఇల్లు లేదని కలెక్టర్కు అర్జీ సమర్పించారు. విజయరామపురం గ్రామంలో ఇంటింటికి వెళ్లి పిల్లలు ఎంతమంది ఉన్నారన్నది సర్వే చేసి అంగన్వాడి కేంద్రం కొరకు ప్రతిపాదించాలని సూచించారు. విజయరామపురం ప్రధాన తారు రోడ్డు నుండి గూడెం వరకు అప్ప్రోచ్ గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని డ్వామా పీడీని ఆదేశించారు. అనంతరం హరిజనవాడ ని సందర్శించారు. అక్కడ ఇరవై ఏళ్ల క్రితం నిర్మించిన సిసి రోడ్లు పాడైపోయాయి , కొత్త రోడ్లు వేయాలని స్థానికులు కోరగా రోడ్ల పునరుద్ధరణకు, కాలువల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అక్కడి మండల ప్రాథమిక పాఠశాల ఖాళీగా ఉండడంతో అంగన్వాడి కేంద్రాన్ని అక్కడ నెలకొల్పాలని ఐసిడిఎస్ పిడిని ఆదేశించారు. అలాగే జిల్లా అంతటా ప్రభుత్వ పాఠశాల ఖాళీగా భవనాలు అందుబాటులో ఉన్నాయి ఎంపీడీవోల ద్వారా సిడిపిఓలు వివరాలు సేకరించి తనకు సమర్పించాలని సూచించారు. హరిజనవాడ నుంచి స్మశానం వరకు గ్రావెల్ రోడ్డు, శ్మశానం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని స్థానికులు కోరగా అందుకు వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో ఉన్న వీరమ్మ తన 18ఏళ్ల కుమారుడు వీరేంద్ర బుద్ధిమాంద్యత, పోలియో తో ఇబ్బంది పడుతున్నాడని పెన్షను వస్తోందని కానీ జీవనోపాధికి ఆర్థిక సహాయం అందించాలని కోరారు. పరిశీలించి తగు సహాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం పెద్ద గోపవరం, చిన్న గోపవరం గ్రామాలను, ఎస్సి, ఎస్టీ కాలనీలు కూడా సందర్శించి స్థానికులు నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ కూడా అంగన్వాడీ కేంద్రాలు, ఇల్లు లు, రోడ్స్ కావాలని ప్రజలు కోరగా వాటన్నిటినీ నెరవేర్చేందుకు తప్పకుండా చర్యలు తీసుకుంటామన కలెక్టర్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు, డ్వామా, డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్లు హరి హరనాథ్, రామచంద్రారెడ్డి, జెడ్పీ సిఇఓ వెంకటేష్, ఐసిడిఎస్ పీడీ పద్మజ, మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ ఖాదర్బాషా, రాజంపేట ఆర్డిఓ వీరబ్రహ్మం, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, ఎంపిడివో వెంకటేష్, తాసిల్దార్ చిన్నయ్య, వివిధ శాఖల అధికారులు వారి సిబ్బంది పాల్గొన్నారు.