*జగనన్న పాలన – ప్రజా సంక్షేమ పాలన*

వార్తలు
1,378 Views

జిల్లాలో సచివాలయ వ్యవస్థ లోని గ్రామ, వార్డు వాలంటీర్లు, సెక్రెటరీ సిబ్బంది ద్వారానే సంక్షేమ ఫలాలు వంద శాతం లబ్దిదారులకు అందుతున్నాయని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా పేర్కొన్నారు. తొలియేడు -జగనన్న తోడు, “మన పాలన- మీ సూచన” కార్యక్రమంలో భాగంగా సోమవారం మధ్యాహ్నం స్థానిక స్పందన హాలులో జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అధ్యక్షతన నిర్వహించిన “మనపాలన – మీ సూచన” లో భాగంగా క్షేత్ర స్థాయిలో పనిచేసిన గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లు, సిబ్బంది, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ, అన్ని శాఖల అధికారులు, పలువురు నిపుణులతో మేధో మథన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులుగా హాజరైన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. పాదయాత్రలో, ఎన్నికల మేనిఫేస్టోలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్ల ద్వారా పరిపాలన వ్యవస్థను కొత్తపుంతలు తొక్కించారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15,003 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారన్నారు. వీటి ద్వారా 1.34 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలను కల్పించిందన్నారు. ఇంటి వద్దకే ప్రభుత్వ పాలనను తీసుకొచ్చామన్నారు. ఈ నెల 30 తేదీ నాటికి అధికారంలోకి వచ్చి.. ఏడాది కాలం పూర్తి కావస్తున్న సందర్భంగా “మన పాలన- మీ సూచన” పేరుతో ఓ సరికొత్త కార్యక్రమానికి సోమవారం శ్రీకారం చుట్టినట్లు వివరించారు. జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ మాట్లాడుతూ… వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన చేపట్టిన కొద్దిరోజుల్లోనే పరిపాలనలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారని, గత ఏడాది అక్టోబర్‌ 2వ తేదీ గాంధీ జయంతి నాటి నుంచి గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని రాష్ట్రమంతా ఆవిష్కరించారన్నారు. జిల్లాలో 15,100 మంది వాలంటీర్లకు, 7400 మంది గ్రామ, వార్డు సెక్రెటరీలు నియమించిందన్నారు. ప్రస్తుతం వార్డు వాలంటీర్ల ద్వారా అర్హులైన వారందరికీ ఇంటి దగ్గరకే ప్రభుత్వ ఫలాలు చేరుతున్నాయన్నారు. తాజాగా.. కోవిడ్ -19 విఫత్కర పరిస్థితిలో వాలంటీర్లు విశిష్టమైన సేవలు అందించారని కలెక్టర్ అభినందించారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, పోలీసు సిబ్బంది తో పాటు.. సచివాలయ సిబ్బంది అయిన ఏఎన్ఎం లు, ఆశ వర్కర్లు, వాలంటీర్లు ఫీవర్ సర్వే నిర్వహణలో బాధ్యతగా, భయంలేకుండా విధులు నిర్వహించారన్నారు. కోవిడ్ నియంత్రణలో జిల్లాలో పాజిటీవ్ కేసులు పెరగకుండా తటష్ఠంగా ఉందంటే.. వాలంటీర్లు చురుకుకుగా పనిచేయడం వల్లే సాధ్యమైందన్నారు. పెన్షన్ పంపిణీ ఒక్కరోజులో పూర్తి చేస్తున్న వాలంటీర్లకు ప్రోత్సాహక నగదు బహుమతి కూడా ఇవ్వడం జరుగుతోందన్నారు. అలాగే.. జిల్లా ప్రజల కల నెరవేర్చేందుకు.. జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, గండికోట జలాశయం నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి జిల్లాను సుభిక్షం చేసేందుకు ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారన్నారు. ఆయన ఆశయ సాధనలోనే జిల్లా యంత్రాంగం, అధికారులు కూడా అడుగులేస్తున్నారన్నారు. నవరత్నాల్లోని అని పథకాలను ఇప్పటికే… ప్రారంభించి ప్రజలను పూర్తిస్థాయిలో సంతృప్తి పరిచారన్నారు. ఈ నేపథ్యంలో.. ఏడాది పాలనపై సాధించిన విజయాలు, మరింత సుపరిపాలన కోసం.. ప్రజల నుండే సలహాలు, సూచనలను ముఖ్యమంత్రి స్వీకరించడం జరుగుతోందని చెప్పారు. అనంతరం అభివృద్ధి విభాగం జేసీ సాయికాంత్ వర్మ మాట్లాడుతూ.. అధికార వికేంద్రీకరణను చేపట్టడంతో పాటు పాలనలో జవాబుదారీ, పారదర్శకతను ప్రభుత్వం తీసుకువచ్చిందని, ఇందులో భాగంగా అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసిందన్నారు.
లబ్ధిదారుల గుర్తింపునకు ఇంటింటి సర్వే
ఇదిలా ఉంటే.. వైఎస్సార్‌ నవశకం పేరుతో నవరత్నాల్లోని పథకాలన్నింటికీ సంతృప్త (శాచురేషన్‌) స్థాయిలో అర్హులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే చక్కటి ఫలితాలను అందించిందన్నారు. నవరత్నాల్లోని ప్రభుత్వ పథకాలను వర్తింపజేయడానికి రాజకీయాలు, పార్టీలు, మతాలు, కులాలు, ప్రాంతాలు చూడబోమని, అర్హత ఉంటే చాలు.. వారికి ప్రభుత్వ పథకాలు అందిస్తామని, పైసా లంచం ఇవ్వకుండానే ప్రయోజనాలను నేరుగా ఇంటికి పంపిస్తానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీ ఏడాదిలోనే 90 శాతం పూర్తి చేసిందన్నారు. ఇప్పటి వరకూ జిల్లాలో సాధించిన ప్రగతిని.. పథకాల అమలు తీరును పవర్ పాయింట్ ప్రదర్శన ద్వారా ఆయన వివరించారు.

అనంతరం జిల్లాలోని పలు మండలాల నుండి వచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లు, సెక్రెటరీలు, వెల్ఫేర్ అసిస్టెంట్లు విధి నిర్వహణలో క్షేత్ర స్థాయిలో ఎదురయిన అనుభవాలు తెలిపారు. అందరూ కూడా సచివాలయ వ్యవస్థలో ప్రజలకు సేవాలందించడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. అలాగే.. ప్రభుత్వం చేపట్టే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు.. మరింత సమర్థవంతంగా నడిచేందుకు పలు సూచనలు, సలహాలు, అభిప్రాయాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. వీటన్నింటిపై నివేదికను రూపొందించి ప్రభుత్వానికి పంపడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

26 నుంచి 30వ తేదీ వరకు కార్యక్రమాల వివరాలు :

26వ తేదీన వ్యవసాయ అనుబంధ రంగాల్లో రైతులకు కల్పించిన ప్రయోజనాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో ముఖాముఖి ద్వారా చర్చిస్తారు. 27వ తేదీన విద్యారంగ సంస్కరణలు, విద్యార్థుల కోసం ఉద్దేశించిన పథకాలపై నిపుణులతో చర్చ ఉంటుంది. 28వ తేదీన పరిశ్రమలు, పెట్టుబడుల రంగం, పరిశ్రమలకు కల్పించిన, కల్పించాల్సిన వసతులపై పారిశ్రామిక వేత్తలతో చర్చిస్తారు. 29వ తేదీన ఆరోగ్య రంగం, సంస్కరణలు, ఆరోగ్యశ్రీలో వచ్చిన మార్పులపై చర్చ ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ ముఖ్యమంత్రి
తాడేపల్లి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తారు. షెడ్యూలు ప్రకారం.. ప్రతి రోజు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర గంటల వరకు రాష్ట్ర స్థాయిలో కార్యక్రమాలు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు జిల్లాలో సమీక్ష ఉంటుందన్నారు. సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరుపై నేరుగా లబ్ధిదారులతోపాటు ముఖ్య నేతలు, వివిధ రంగాల నిపుణులతో ఇష్టాగోష్టి కార్యక్రమాలు నిర్వహిస్తారు. కరోనా వైరస్ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని 50 మందికి మించకుండా పాల్గొనడం జరుగుతుంది. ఈ సదస్సు అన్నింటిపై ప్రతి జిల్లా నుంచి ప్రభుత్వం నివేదికలు తెప్పించుకుని వాటిని క్రోడీకరించి లక్ష్యాలు రూపొందించనున్నారు.Leave a Reply

Your email address will not be published. Required fields are marked *