జిల్లాలో 27 వేల మంది లబ్ధిదారుల గుర్తింపు

వార్తలు
1,329 Views

జిల్లాలో అర్హులైన పేదలందరికీ ఇంటి పట్టాల పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి. అంజాద్‌ బాషా తెలిపారు. పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేసేందుకు వీలుగా శనివారం ఉప ముఖ్యమంత్రి, జాయింట్ కలెక్టర్ గౌతమితో కలిసి రెండవ డివిజన్ నానాపల్లెలో ప్రభుత్వ భూములను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎస్.బి. అంజాద్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలోనే ప్రజలకు ఇచ్చిన హామీలలో 90% హామీలు నెరవేర్చడం జరిగిందన్నారు. పాదయాత్ర సమయంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వడం జరుగుతుందని తెలపడం జరిగిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 27 లక్షల మంది పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం అనంతరం రాబోయే నాలుగు సంవత్సరాలలో దశలవారీగా లబ్ధిదారులకు ఇల్లు కూడా నిర్మించి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇంటి పట్టాల పంపిణీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జూలై 8వ తేదీ మహానేత దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. ఇంటి పట్టాలు మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తామన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి గతంలో ఎవరూ చేయని విధంగా ఓకే సారీ రాష్ట్ర వ్యాప్తంగా 27 లక్షల మందికి ఇంటి పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టబోతున్నారన్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎక్కడ కూడా బోధ కొట్టం కనిపించకూడదని గతంలో ఇందిరమ్మ పథకం ద్వారా పేదలందరికీ ఇళ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. తండ్రి అడుగుజాడల్లో నేడు మన ముఖ్యమంత్రి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారన్నారు. కడప జిల్లాలో 27 వేల మంది ఇంటి పట్టాలకు అర్హులను గుర్తించడం జరిగిందన్నారు. ప్రస్తుతం 17వేల ఇంటి స్థలాలకు భూమి గుర్తించడం జరిగిందని ఇంకా పది వేల మందికి స్థలాలు గుర్తించాల్సి ఉందన్నారు. ఇందుకు 250 ఎకరాల భూమి కావాల్సి ఉందన్నారు. ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమానికి కొద్ది రోజులే గడువు ఉన్నందున పట్టా భూములను కొనుగోలు చేసి అర్హులందరికీ ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ గౌతమి మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. రైతులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు భూములు ఇచ్చేందుకు ముందుకు రావాలన్నారు. జూలై 8 వ తేదీన పేదలకు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ మేయర్ సురేష్ బాబు, వైఎస్సార్ సీపీ యువ నాయకులు అహ్మద్ భాష, ఆర్డీవో మలోల, మున్సిపల్ కమిషనర్ లవన్న, తాసిల్దార్ శివరామిరెడ్డి, వైయస్సార్ సిపి నాయకులు దాసరి శివప్రసాద్, మైనార్టీ నాయకులు సుభాన్ భాష, నగరం మైనార్టీ సెల్ అధ్యక్షులు షఫీ, రెండవ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి సుబ్బారెడ్డి, 2 వ డివిజన్ ఇంచార్జి రాజగోపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *