డాక్టర్ గిరిధర్ సేవలు మరువలేనివి

వార్తలు
1,365 Views

ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సర్వతోముఖాభివృద్ధికి డాక్టర్ గిరిధర్ చేసిన సేవలు మరువలేనివని ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా అన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక ఫాతిమా మెడికల్ కాలేజీలో రిమ్స్ సూపరిండెంట్ డాక్టర్ గిరిధర్ పదవీ విరమణ వీడ్కోలు సమావేశం జరిగింది. కార్యక్రమానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి గిరిధర్ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఎనలేని సేవలు అందించారని అలాగే ప్రస్తుతం కోవిడ్-19 కరోనా వైరస్ నియంత్రణలో ఎంతో బాగా పనిచేసి కరోనా వైరస్ సోకిన బాధితులను వైద్య చికిత్సలు అందించి కాపాడన్నారు. ప్రభుత్వ పరంగా పదవీవిరమణ అయినా వృత్తిరీత్యా ప్రజలకు సేవలందించే అవకాశముందని తెలిపారు. యువజన సర్వీసుల అధికారి, కోవిడ్ నోడల్ అధికారి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ డాక్టర్ గిరిధర్ మంచి వ్యక్తి అని, వృత్తిపరంగా ఎన్నో సేవలు అందించారని, కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఫాతిమా మెడికల్ కాలేజీ నందు ఆయనతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈసందర్భంగా డాక్టర్ గిరిధర్‌కు శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఫాతిమా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ జయరామిరెడ్డి, వైద్యాధికారులు డాక్టర్ ఓబులేసు, వెంకట శివ, వెంకటరెడ్డి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *