తెదెపా దుర్మాగపు పాలనపై జగన్ ఫైర్

పేదలకు ప్రభుత్వం పంచి ఇచ్చిన అసైన్డ్ భూములను మంత్రుల అండతో తెలుగుదేశం పార్టీ నేతలు ఎలా దుర్మార్గంగా ఆక్రమించుకుంటున్నారో పత్రికల్లో వచ్చిన కథనాలను చూపిస్తూ నిప్పులు చెరిగి వైకాపా అధినేత వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సేవ్ విశాఖ’ పేరిట జరిగిన మహాధర్నాలో ప్రసంగిస్తూ, తాను చేసే ఆరోపణలకు సాక్ష్యంగా తెలుగుదేశం పార్టీకి వంతపాడే ఈనాడు దినపత్రికలో వచ్చిన కథనాలనే చూపిస్తున్నానని చెప్పారు.

“చోడవరం ఎంపీపీ… గొన్నూరు వెంకట సత్యన్నారాయణ అంటే పెద్దబాబు… కొమ్మాదిలో తన పేరుతో 24.3 ఎకరాలు, తన భార్య కొండతల్లి పేరుతో మరో 25 ఎకరాలు… వాళ్ల పేర్లతో భూములు రాయిచ్చేసుకున్నారు. ‘ఈనాడు’ కథనం. పేపర్లో వచ్చింది. ఇది ‘సాక్షి’ కాదు. ఈనాడు కథనాన్ని మాత్రమే చూపిస్తా ఉన్నా” అని అన్నారు. ఆక్రమణకు గురైన పేదల భూములను తిరిగి ఇప్పించేందుకు తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. దారుణంగా భూములను కాజేస్తున్నారని జగన్ ఆరోపించారు. ‘గీతం’ కాలేజీలు నడిపే చంద్రబాబు బంధువు ఎంవీవీఎస్ మూర్తి, రూ. 1000 కోట్ల విలువ చేసే 55 ఎకరాలు కబ్జా చేసి, ఆ భూములను తనకు ఇవ్వాలని చంద్రబాబుకు లేఖ రాస్తే, క్యాబినెట్ లో తీర్మానం చేసి మరీ అప్పనంగా కట్టబెట్టారని దుయ్యబట్టారు.

June 22, 2017

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *