నాన్ కంటైన్మెంట్ జోన్ గా ఎర్రగుంట్ల అర్బన్

వార్తలు
182 Views

కంటెయిన్‌మెంట్‌ జోన్ ఆంక్షలతో ఉన్న ఎర్రగుంట్లను (అర్బన్) ఈనెల 29వతేదీ నుంచి నాన్ కంటెయిన్‌మెంట్‌ జోన్ గా ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఒక కంటెయిన్‌మెంట్‌ జోన్ లో చివరి పాజిటివ్ కేసు నమోదై తదుపరి 28 రోజుల వరకు ఎటువంటి పాజిటివ్ కేసు నమోదు కాని పక్షంలో ఆ కంటెయిన్‌మెంట్‌ జోన్లో ఉండాల్సిన ఆంక్షలను ఎత్తివేసి నాన్ కంటెయిన్‌మెంట్‌ జోన్ గా పరిగణించాలని
” కొవిడ్ ఇన్స్టంట్ ఆర్డర్ 50 ” ను ప్రభుత్వం జారీ చేసింది. వారి ఆదేశాల మేరకు కంటెయిన్‌మెంట్‌ జోన్ ఆంక్షలతో ఉన్న ఎర్రగుంట్ల (అర్బన్) లో గడచిన 28 రోజులు వరకు ఎటువంటి పాజిటివ్ కేసు నమోదు కానందున నిషేధాజ్ఞలు ఎత్తివేసి ఎర్రగుంట్లను (అర్బన్) నాన్ కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించామని కలెక్టరు ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *