జిల్లాలోని వీరపునాయినిపల్లె మండలంలోని అనిమెల, యు. రాజుపాలెం, అలిందెన, గొనుమాకులపల్లి, పిళ్లావారిపల్లి గ్రామాల పరిధిలోని 118.87 ఎకరాల ప్రభుత్వ భూమిని  పవన విద్యుత్ కేంద్ర ప్రాజెక్టు కోసం కేటాయించేందుకు మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. అనిమెల, యు.రాజు పాలెం, గొనుమాకులపల్లి గ్రామాల్లో మార్కెట్ ధర ప్రకారం ఎకరా ఒక్కింటికి రూ.2 లక్షలు, అలిదెన గ్రామంలో ఎకరా ఒక్కింటికి మార్కెట్ ధర ప్రకారం రూ.2.50,00, పిళ్లావారిపల్లె గ్రామంలో మార్కెట్ ధర ప్రకారం ఎకరా ఒక్కింటికి రూ1.50,000 చెల్లించే ప్రతిపాదనపై అప్పగించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది