ysrkadapa

వార్తలు

పాడాపై ముఖ్యమంత్రి సమీక్ష

పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ ఏజెన్సీపై గురువారం ఉదయం సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి అభివృద్ధి పథకాలపై సమీక్ష చేశారు. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ సి. హరికిరణ్, పాడా ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డితోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు, పాడా అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాడాలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పథకాలు, వాటి పురోగతితో పాటు జిల్లాకు సంబంధించి ముఖ్యమైన అభివృద్ధి పథకాల్లో తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ ముఖ్యమంత్రికి సమగ్రంగా వివరించారు.

ఈ సందర్భంగా పలు అభివృద్ధి పథకాలకు సంబంధించి ముఖ్యమంత్రి జారీచేసిన సూచనలు, అంశాలు :*

*** పులివెందుల మెడికల్‌ కాలేజి శంకుస్ధాపన పనుల పురోగతిపై ఆరా తీసి ఆగస్టు కల్లా టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టి త్వరితగతిన పూర్తిచేసి ఈ సంవత్సరంలోగా మెడికల్‌ కాలేజి పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.

*** జిఎన్‌ఎస్‌ఎస్‌ మెయిన్‌ కెనాల్‌ – చక్రాయపేట లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని… వీలైనంత త్వరగా పనులు గ్రౌండింగ్‌ కావాలని, యుద్ధప్రాతిపదికన ఈ నెలాఖరుకల్లా జ్యూడిషియల్‌ ప్రివ్యూ పూర్తి చేసి టెండర్ల ప్రక్రియకి సిద్దం కావాలని సూచించారు.

*** వేంపల్లి మండలంలో అలవలపాడు మరియు పెండ్లూరు చెరువు, జిఎన్‌ఎస్‌ఎస్‌ నుంచి పిబిసి కెనాల్‌కు రూ.46.5 కోట్లతో లిఫ్ట్‌ స్కీంకు పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేయాలని ఆదేశం.

*** లిఫ్ట్‌ స్కీమ్‌ ద్వారా చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి యర్రబల్లి మరియు కొత్తగా నిర్మించనున్న గిడ్డంగివారి పల్లె చెరువు,

పులివెందులలో అరటి స్టోరేజి, ప్రాసెసింగ్‌ యూనిట్‌తో పాటు అనంతపురం, కడప వంటి అరటి సాగు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రాసెసింగ్‌ యూనిట్లు సిద్దం చేయాలని, అరటి, టమాటా, బత్తాయి పంటల దిగుబడి సమయంలో సమస్యలు రాకుండా, రైతులు నష్టపోకుండా శాశ్వత పరిష్కారం ఉండాలని సీఎం సూచించారు.

ఆటోనగర్‌లో మౌలిక వసతులకు రూ.2.71 కోట్లు పాడా నిధుల నుంచి మంజూరు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

ఇడుపులపాయ టూరిజం సర్క్యూట్, వైఎస్‌ఆర్‌ మెమోరియల్‌ గార్డెన్‌ డెవలప్‌మెంట్‌ పనులను, తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా అధికారులు వివరించారు.

పులివెందుల నియోజకవర్గంలో ఆర్‌ అండ్‌ బి, పంచాయితీరాజ్‌ శాఖ పరిధిలో రోడ్ల వెడల్పు, పెండింగ్‌ పనుల వివరాలను సమీక్షలో చర్చించారు.

*** అగ్రికల్చర్‌ అడ్వైజరీ కమిటీలు త్వరగా నియమించి మిల్లెట్‌ల సాగుకు ప్రాధాన్యతనివాలని సీఎం సూచన.

*** ఏపీ కార్ల్‌ పనితీరుపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని, ఏపీ కార్ల్‌కు అనుబంధంగా అగ్రికల్చర్, హర్టికల్చర్, వెటర్నరీ కాలేజీలతో పాటు వ్యాక్సిన్‌ తయారీ యూనిట్‌ని వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

*** అరటి రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, అరటి రీసెర్చ్‌ సెంటర్‌లో ట్రైనింగ్‌ వెంటనే ప్రారంభించాలని సూచించిన సీఎం.

*** పైడిపాలెం రిజర్వాయర్‌ను టూరిజం స్పాట్‌గా రూపొందించడంతో పాటు… ఇడుపులపాయ టూరిజం సర్క్యూట్‌లో భాగంగా వైఎస్‌ఆర్‌ ఘాట్‌ అభివృద్ది, బొటానికల్‌ గార్డెన్, ఎకో పార్క్, నెమళ్ళ బ్రీడింగ్‌ సెంటర్, గండి ఆలయం, మోపూరి భైరేశ్వర ఆలయంతో పాటు మరో 69 ఆలయాల పునరుద్దరణ, టీటీడీ కళ్యాణమండపాల నిర్మాణం, పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని పనులు పూర్తికి పలు సూచనలు చేశారు.

*** పులివెందులలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్కూల్‌ ఏర్పాటుపై మరింత దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా సీఎం అధికారులను సూచించారు.

*** పులివెందుల నగరం అభివృద్దితో పాటు ఆర్టీసీ బస్‌స్టాండ్‌ తరలింపు మరియు కొత్త బస్‌స్టాండ్‌ నిర్మాణంపై త్వరలో మరోసారి సమావేశం ఏర్పాటుచేయాలని ఆదేశం.

*** నవరత్నాలలో భాగంగా పేదలందరికీ ఇళ్ళు, వైఎస్‌ఆర్‌ జగనన్న హౌసింగ్‌ కాలనీ లేఔట్‌ను సీఎం పరిశీలించారు.

*** పులివెందులలో 255 ఎకరాల్లో జిల్లాలో అతి పెద్ద లేఅవుట్‌ చేసినట్లు వెల్లడించిన అధికారులు.

*** ఒక్క పులివెందుల నియోజకవర్గంలోనే దాదాపు 15 వేల మందికి పైగా లబ్దిదారులకు ఇళ్ళపట్టాలు సిద్దం చేశామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.

*** మైదుకూరు, రాయచోటి నియోజకవర్గాలలో 2019 డిసెంబర్‌లో సీఎం పర్యటన సందర్భంగా చేసిన శంకుస్ధాపనల పనులకు త్వరితగతిన జ్యూడిషియల్‌ ప్రివ్యూ పూర్తిచేసి టెండర్లు పిలవాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు.

Leave a Comment