ysrkadapa-chandra babu naiduముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం కడపకు రానున్నారు. ఉదయం 11.15గంటలకు విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి జిల్లా పరిషత్‌ ప్రాంగణం చేరుకుని ఉక్కు పరిశ్రమ సాధన కోసం ఆమరణదీక్ష చేస్తున్న రాజ్యసభ సభ్యుడు రమేష్‌నాయుడును పరామర్శిస్తారు. 1.30గంటలకు తిరిగి విమానాశ్రయం చేరుకుంటారు. 2గంటలకు బయలుదేరి వెళ్లనున్నారు.