Friday, March 29, 2024

రైతు భరోసా కేంద్రాలతో మరో హరిత విప్లవానికి నాంది

రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుతో రాష్ట్రంలో మరో హరిత విప్లవానికి నాంది పలికినట్లయిందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా పేర్కొన్నారు. శనివారం జిల్లాలోని వల్లూరు మండల కేంద్రంలో ప్రారంభమైన రైతు భరోసా కేంద్రంలో సేవలను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ లు ప్రారంభించారు.
రైతు భరోసా కేంద్రం లో ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ ఒక్కో భవనం రూ. 21లక్షలతో 620 కేంద్రాలను రూ. 130 కోట్లతో ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఈసందర్భంగా రాష్ట వ్యవసాయ శాఖ వారు ప్రచురించిన అన్ని రకాల పంటలకు సంబంధించి “సమగ్ర పంట సాగు యాజమాన్యం”, పురుగులు, తెగుళ్లు, పోషక లోపాల యాజమాన్యం” మొదలయిన పుస్తకాలతో పాటు, పలురకాల వ్యవసాయ సంబంధ మ్యాగజైన్లు, పబ్లికేషన్లను డిప్యూటీ సీఎం, కలెక్టరు, ఎమ్మెల్యేలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో కమలాపురం శాసనసభ్యులు పి.రవీంద్రనాథ్ రెడ్డి, జెసి ఎం.గౌతమి, శిక్షణ కలెక్టర్ వికాష్ మర్మాట్, వ్యవసాయ శాఖ జెడి మురళీకృష్ణ, ఉద్యానవన శాఖ డీడీ మధుసూదన్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ జెడి సత్యప్రకాష్, పట్టు పరిశ్రమ శాఖ ఏడి రాజశేఖర్రెడ్డి, ప్రకృతి వ్యవసాయం డిపిఎం నాగరాజు, ఆత్మ పీడీ చంద్రనాయక్, నియోజకవర్గంలోని ప్రముఖ రైతునాయకులు దుర్గయ్య పల్లి మల్లికార్జున్రెడ్డి, సంబర్ టూరు ప్రసాదరెడ్డి, మండల నాయకులు, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular