కోవిడ్‌ బాధితులకు 10 పడకల ఇంటెన్సివ్ కేర్ యూనిట్

వార్తలు
688 Views
జిల్లాలో కోవిడ్ పేషంట్ల కోసం రూ.86 లక్షల ఖర్చుతో రిమ్స్ ఆసుపత్రిలో అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు చేసిన 10 పడకల ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ను గురువారం ప్రభుత్వం చీఫ్ విప్ జి.శ్రీకాంత్ రెడ్డి, ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి, కలెక్టరు సి.హరికిరణ్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ….. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో రెగ్యులర్ కొవిడ్, నాన్ కోవిడ్ వింగ్ పేషంట్లకు 300 పడకలు కేటాయించారని, వాటికి అదనంగా ఈ స్టెప్ అప్ ఐసియూ యూనిట్ ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో అటాచ్డ్ బాత్ రూమ్, ఏసీ, అధునాతన వెంటిలేటర్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. 20 రోజుల సమయంలో ఈ స్టెప్ అప్ ఐసియు యూనిట్ ను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఐసియూలో ఏదైనా కేసు సీరియస్ అయితే వెంటిలేటర్ కలిగిన ఈ స్టెప్ అప్ ఐసియూకి తరలించి చికిత్స అందిస్తారని పేర్కొన్నారు. స్టేట్ కొవిడ్ ఆసుపత్రి, డిస్ట్రిక్ట్ కోవిడ్ ఆసుపత్రి మధ్యలో ఈ ఐసియూ వారధిగా ఉపయోగపడు తుందన్నారు. ఇంకా ఇక్కడ చేయలేని కేసులను ఆక్సిజన్ సపోర్టుతో స్విమ్స్ కు తరలిస్తారని చెప్పారు. కోవిడ్ విషయంలో 99 శాతం ప్రభుత్వమే భారం మోస్తోందని….. ప్రొద్దుటూరు, పులివెందులలో కూడా ఆసుపత్రులు సిద్ధం అయ్యాయని పేర్కొన్నారు.

అనంతరం ప్రభుత్వ చీఫ్ విప్, ఎంపీలు మాట్లాడుతూ…. జిల్లాలో ప్రస్తుతం కోవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో కేసులు పెరిగే కొద్ది వాటికి తగినట్లుగా వచ్చే పేషంట్లకు చికిత్స అందించేలా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోందని, అందులో భాగంగానే అధునాతన సౌకర్యాలతో ఐసియూను అందుబాటులోకి తీసుకు రావడం జరిగిందన్నారు. జిల్లాలో దాదాపు 700 మంది హోమ్ క్వారంటైన్ లో ఉన్నారని, 6 కోవిడ్ కేర్ సెంటర్లలో దాదాపు 2000 వేల పడకలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. మరో 1000 పడకలతో అదనంగా కెపాసిటిని పెంచడం జరుగుతోందన్నారు. ప్రొద్దుటూరు సర్వజన ఆస్పత్రిలో 180 బెడ్స్, పులివెందుల ఏరియా ఆసుపత్రిలో 80 బెడ్స్ సిద్ధం చేశారని, వీటిలో కొన్నింటికి ఆక్సిజన్, మరి కొన్నింటికి వెంటిలేటర్ సౌకర్యం కూడా ఉన్నాయన్నారు. పాజిటివ్ కేసులు పెరిగే కొద్ది జిల్లా యంత్రాంగం అందుకు తగ్గట్లుగా సన్నద్ధం అవుతోందని వారు స్పష్టం చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టరు (అభివృద్ధి) సిఎం సాయికాంత్ వర్మ, మాజీ మేయర్ సురేష్ బాబు, మునిసిపల్ కమీషనర్ లవన్న, రిమ్స్ సూపరింటేoడెంట్ డా.ప్రసాద రావు, రిమ్స్ కళాశాల ప్రిన్సిపల్, ఏపిఎంఎన్ఇడిసి ఇఇ సత్య ప్రభాకర్, రిమ్స్ ఆసుపత్రి వైద్యులు, నర్సులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *