కడపలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలనే డిమాండుతో కడప కోటిరెడ్డి సర్కిల్ లో  రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహారదీక్షలు 350వ రోజుకు చేరుకున్నాయి.  నిరాహారదీక్షల శిబిరం వద్దకు చేరుకున్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నాయుడు, ఎమ్మెల్సీ బిటెక్ రవి, తితిదే ఛైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్, తెదేపా జిల్లా అధ్యక్షుడు వాసులు పాల్గొని మద్దతు తెలిపారు.  మున్సిపల్ వర్కర్స్ యూనియన్  జిల్లా కార్యదర్శి సుంకర రవితోపాటు మున్సిపల్‌ నాయకులకు పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభించేలా చేశారు.  సుదీర్ఘ కాలం ఉక్కు ఉద్యమం నిర్వహిస్తున్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డిని పార్టీ నాయకులను అభినందించారు.