ysrkadapa

వార్తలు

విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం

జిల్లాలో రెండు రోజుల పర్యటన కోసం కడప విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులు నాయకులు ఘనస్వాగతం పలికారు. ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, జిల్లా ఇంచార్జి మంత్రి ఆది మూలపు సురేష్, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, డి.ఐ.జి సెంథిల్ కుమార్ , నగరపాలక సంస్థ కమీషనర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్ తోపాటు ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి, రఘు రామి రెడ్డి, దాసరి సుధ, జెడ్పి ఛైర్మెన్ ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి, కడప నగర మేయర్ సురేష్ బాబు, కడప ఆర్డీవో ధర్మచంద్రారెడ్డి, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు అంబటి క్రిష్ణా రెడ్డి, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి, వ్యవసాయ సలహామండలి జిల్లా చైర్మన్ సంబటూరి ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.