Tuesday, February 27, 2024

నాడు-నేడు పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు

నాడునేడు రెండోవిడత పనులను ఇంజనీరింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టరు వి.విజయరామరాజు ఆదేశించారు. నాణ్యతా లోపాలు ఉంటే చర్యలు తప్పవన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ స్పందన హాలులో జగనన్న విద్యా కానుక పంపిణీ, మనబడి నాడు నేడు రెండోవిడత పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని పాఠశాలల్లో జగనన్న విద్యా కానుక కిట్లను పెండింగ్ లేకుండా పంపిణీ చేయాలన్నారు. డిజిటల్ విద్యా విధానానికి నాంది పలికిన ప్రభుత్వం జిల్లాలో 1109 తరగతి గదులకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ మంజూరు అయ్యాయని, నిర్వహణపై ఉపాధ్యాయులకు శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు.
జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమానికి సంబంధించి ఈ నెల 15న నియోజకవర్గ స్థాయిలో, 17న జిల్లా స్థాయిలో ఎంపిక చేసిన విద్యార్థులకు అవార్డులను అందించే ఏర్పాట్లు చేసి కార్యకమాన్ని విజయవంతం చేయాలన్నారు. 2023-24 అకడమిక్ క్యాలెండర్ ను ఎం.ఈ.ఓ.లు ఖచ్చితంగా అనుసరించాలని, ఈ విద్యాసంవత్సరం పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలల్లో ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించి విద్యార్థుల్లో చదువుపై మక్కువ పెంచాలనానరు. ప్రాథమిక పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular