రహదారి ప్రమాదాల నివారణకు యుద్ధ ప్రాతిపదికన భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్‌ ఆదేశించారు. కలెక్టర్‌ ఛాంబర్‌లో రోడ్డు భద్రతపై నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారి, పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖ, ట్రాన్స్‌పోర్టు,  పోలీస్ అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదం సంభవిస్తే ఆయా శాఖల అధికారులే బాధ్యత వహించాలన్నారు.  తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతంలో చర్యలు తీసుకున్నా అదే ప్రాంతంలో ప్రమాదం జరిగితే అధికారులను బాధ్యులు చేయడం జరుగుతుందన్నారు. అధికారులు సానుకూల దృక్పథంతో విధులు నిర్వహించాలని,  రోడ్డు భద్రత అంశాలను చాలా సున్నితంగా ఆలోచించి నివారణ చర్యలు తీసుకోవాలన్నారు . కడప నుంచి హైదరాబాదులో చేపట్టాల్సిన పనులకు సంబంధించి పూర్తిచేయాలన్నారు . మినిట్స్ లో పొందుపరిచిన విధంగా కడప నుంచి హైదరాబాద్ వెళ్లే రోడ్డు చేపట్టాల్సిన పనులను పూర్తి చేయాల్సి ఉందన్నారు. రాజంపేటకు వెళ్ళే రోడ్డులో ప్రమాదం సంభవిస్తుందని సమస్యను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు.  జిల్లాలోని ఏడు రాష్ట్ర రహదారులను తనిఖీ చేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.  పోలీసు యంత్రాంగం సూచించిన విధంగా కడప పట్టణంలో 150 ప్రాంతాల్లో హెచ్చరిక పలను ఏర్పాటు చేయాలని నగర కమిషనర్‌ లవన్నను ఆదేశించారు.  సమావేశంలో రవాణాశాఖ అధికారి బసిరెడ్డి,  ఆర్టీసీ ఆర్ఎం విజయరత్నం, నేషనల్ హైవే ప్రాజెక్ట్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి,  ఈఈ ఓబుల్ రెడ్డి,  ట్రాన్స్కో ఎస్ఈ శివప్రసాదరెడ్డి,  ఆర్ అండ్‌ బీ, పంచాయతీరాజ్ ఎస్సీలు వెంకటరమణారెడ్డి సుబ్బారెడ్డి, ఎన్జీవో శివ శంకర్ తదితరులు పాల్గొన్నారు.