524 Views
మాజీ మంత్రి, తెదేపా కీలక నేత ఆదినారాయణరెడ్డి సోమవారం భాజపాలో చేరారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కాషాయ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. 2014 ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి వైకాపాలో ఎమ్మెల్యేగా గెలుపొంది కొంతకాలం తర్వాత తెదేపాలోకి చేరారు. మంత్రి పదవి దక్కించుకున్నారు. తెదేపాలో కీలక నేతగా వ్యవహరించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో కడప పార్లమెంటు అభ్యర్థిగా తెదేపా తరపున పోటీ చేసి ఓటమి చెందిన ఆది కొంతకాలంగా భాజపాలో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది.