ఆదినారాయణరెడ్డి స్వస్థలం జమ్మలమడుగు నియోజకవర్గంలోని దేవగుడి. తండ్రి సుబ్బరామిరెడ్డి, తల్లి సుబ్బమ్మ. భార్య అరుణ. ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాన్పూర్ విశ్వ విద్యాలయంలో ఎమ్మెస్సీ పూర్తి చేసిన ఆదినారాయణరెడ్డి పర్లపాడులోని డిగ్రీ కళాశాలలో కొంత కాలం రసాయన శాస్త్ర అధ్యాపకునిగా పనిచేశారు. 1993 నుంచి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అనుచరుడిగా ఉన్న ఆది కాంగ్రెస్ పార్టీ తరపున 2004లో పోటీ చేసి విజయం సాధించారు. 2009లోనూ విజయబావుటా ఎగురవేశారు. 2014లో వైకాపా తరపున పోటీ చేసి విజయం సాధించిన ఆది 2016లో జగన్మోహన్రెడ్డితో విబేధించి పార్టీ వీడారు. తెలుగుదేశం పార్టీలోకి చేరారు. శాసనమండలి ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన బీటెక్ రవి గెలుపులో కీలక పాత్ర పోషించారు. 2017 ఏప్రిల్ 2న మార్కెటింగ్, పశుసంవర్థక శాఖ, గిడ్డంగులు, డెయిరీ డెవలప్మెంట్, మత్స్య సహకార విభాగాల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2019 అక్టోబరు 21న భాజపాలో చేరారు. భాజపా వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కాషాయ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
2014లో
మొత్తం ఓట్లు | 2,27,596 | ||
చెల్లిన ఓట్లు | 1,96,416 | ||
విజేత ఆధిక్యత | 12,167 | ||
విజేత | చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి | వైకాపా | 1,00,794 |
సమీప అభ్యర్థి | పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి | తెదేపా | 88,627 |
2009లో
మొత్తం ఓట్లు | 2,06,569 | ||
చెల్లిన ఓట్లు | 1,74,338 | ||
విజేత ఆధిక్యత | 7384 | ||
విజేత | చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి | కాంగ్రెస్ | 84,416 |
సమీప అభ్యర్థి | పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి | తెదేపా | 77,032 |
2004లో
మొత్తం ఓట్లు | 1,44,926 | ||
చెల్లిన ఓట్లు | 1,16,923 | ||
విజేత ఆధిక్యత | 22,693 | ||
విజేత | చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి | కాంగ్రెస్ | 68,463 |
సమీప అభ్యర్థి | పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి | తెదేపా | 45,770 |