కడప విమానాశ్రయం పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ సి. హరి కిరణ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం కడప విమానాశ్రయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ కమిషనర్ లవన్నతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. విమానాశ్రయం సమీపంలో నూరు మీటర్ల దూరం నుంచి విమానాశ్రయం వరకు రహదారికి పక్కన 10 మీటర్ల పొడవు నాలుగు మీటర్ల వెడల్పుతో బ్యూటిఫికేషన్ పనులు, టర్మినల్ బిల్డింగ్ వద్ద గార్డెనింగ్ ఏర్పాటు, డ్రిప్ సౌకర్యం కల్పనకు రూ.80 లక్షల నిధులను నగర పాలక సంస్థకు కేటాయించడంతో చేపట్టిన పనులను పరిశీలించి సూచనలు చేశారు. పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహకారంతో కడప విమానాశ్రయాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాని తెలిపారు. త్వరలో నైట్ ల్యాండింగ్ సౌకర్యం కల్పించే పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, భవిష్యత్తులో కడప విమానాశ్రయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.