ఏపీ నైపుణ్య శిక్షణానికి స్థల పరిశీలన

వార్తలు
511 Views
ఆహ్లాదకరమైన వాతావరణం.. అన్ని వసతులకు, రోడ్డు పరిసరాలకు అనువుగా ఉండేలా ఏపీ నైపుణ్య శిక్షణ కేంద్రం కోసం అనుకూలమైన స్థలాన్ని సేకరించాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ రెవెన్యూ అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఏపీ నైపుణ్య శిక్షణా కేంద్రానికి యోగి వేమన యూనివర్శిటీ ఆవరణలోని 10 ఎకరాల స్థలాన్ని పరిశీలన చేశారు. రోడ్డు పరిసరాలు, ఆహ్లాదకరంగా ఉండేలా 5 నుండి 10 ఎకరాల స్థలం అవసరం అవుతుందని కలెక్టర్‌ పేర్కొన్నారు. పరిశీలించిన స్థలంలో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటుకు అనుకూలతలను అడిగి తెలుసుకున్నారు. అనుకూలం, అందుబాటులో ఉన్న ఇతర ప్రాంతాలను చూసి నివేదికలు పంపాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో వైవీయూ వీసీ సూర్యకళావతి, కడప ఆర్డీవో మలోల, పెండ్లిమర్రి తహసీల్దారు ఉదయం భాస్కర్, సర్వేయర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *