గడికోట శ్రీకాంత్‌రెడ్డి

వార్తలు
19 Views

gadikota srikanth reddyగడికోట శ్రీకాంత్‌రెడ్డిది రాజకీయ వారసత్వమే. నియోజకవర్గాల పునర్విభజన జరగ ముందు 2004 ఎన్నికల్లో లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం నుంచి గెలుపొందిన గడికోట మోహన్‌రెడ్డి కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి. నియోజకవర్గాల పునర్విభజనతో లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం రద్దు కావడంతో రాయచోటి శాసనసభ నియోజకవర్గం నుంచి 2009లో తెదేపా అభ్యర్థి సుగవాసి పాలకొండ్రాయుడపై పోటీ చేసి 14832 ఓట్ల ఆధిక్యత సాధించారు. 2012 ఉప ఎన్నిక‌ల్లో తెదేపా అభ్యర్థి సుగ‌వాసి సుబ్రమ‌ణ్యంపై పోటీ చేసి 56,891 ఆధిక్యత పొందారు.  రాష్ట్రంలో 18 నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ్గా అత్యధిక ఆధిక్యత‌తో గెలుపొందిన అభ్యర్థిగా రికార్డు సృష్టించారు. 2014లో వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి సమీప తెదేపా అభ్యర్థి రెడ్డప్పగారి రమేష్‌కుమార్‌రెడ్డిపై 34,782 ఓట్ల ఆధిక్యతను పొందారు.

పేరు గడికోట శ్రీకాంత్‌రెడ్డి
పుట్టినతేది 1973 జూన్‌ 15
స్వగ్రామం ఎర్రంరెడ్డిగారిపల్లె రామాపురం
తల్లిదండ్రులు కృష్ణమ్మ, మోహన్‌రెడ్డి
విద్యార్హత బీటెక్‌
భార్య శివలలిత
సంతానం రుత్విక్‌రెడ్డి, ఛాహ్న
రాజకీయ ఆరంగ్రేటం 2007లో యువజన కాంగ్రెస్‌ అధ్యక్షునిగా
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *