సాయిప్రతాప్‌

వార్తలు
33 Views

saiprathapరాజంపేట పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సాయిప్రతాప్‌కు ఎదురే లేకుండా పోయింది. 1989 నుంచి 2009 వ‌ర‌కు ఏడుసార్లు పోటీ చేసిన సాయిప్రతాప్ ఆరుసార్లు గెలుపొందారు. 1985-89 మ‌ధ్య కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా బాధ్యత‌లు నిర్వహించిన సాయిప్రతాప్ 1989లో జ‌రిగిన 9వ లోక్‌స‌భ‌తో ఎన్నిక‌ల రంగంలోకి ప్రవేశించి గెలుపొందారు. ఆత‌ర్వాత 1991లో జ‌రిగిన ప‌ద‌వ లోక్‌స‌భ, 1996లో జ‌రిగిన 11వ లోక్‌స‌భ, 1998లో జ‌రిగిన 12వ‌లోక్‌స‌భకు పోటీ చేసి గెలుపొంది వ‌రుస‌గా నాలుగుసార్లు గెలుపొందిన పార్లమెంట్ స‌భ్యునిగా చ‌రిత్రకెక్కారు. 1999లో జ‌రిగిన 13వ లోక్‌స‌భ ఎన్నిక ఓట‌మి చ‌విచూసి 2004లో జ‌రిగిన 14వ లోక్‌స‌భ, 2009లో జ‌రిగిన 15వ లోక్‌స‌భకు ఎన్నిక‌య్యారు.

పూర్తి పేరు  అన్నయ్యగారి సాయిప్రతాప్‌
జ‌న్మించిన తేది 1944 సెప్టెంబ‌రు 20
వివాహ తేది 1972 జూన్ 22
త‌ల్లి ల‌లిత‌మ్మ
తండ్రి తిమ్మయ్య
భార్య కృష్ణవేణి
సంతానం కుమార్తె

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *