ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడు పర్యటన కోసం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. నవ నిర్మాణ దీక్షల్లో భాగంగా ఈనెల 6న ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో జిల్లా పాలనాధికారి హరికిరణ్‌, జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడా, జాయింట్ కలెక్టర్ నాగేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ రామచంద్రారెడ్డి,  కడప ఆర్డీవో దేవేంద్రరెడ్డి, కడప డీఎస్పీలు మసూం బాషా,  రాజగోపాల్‌రెడ్డి తదితరులు కడపలోని  మున్సిపల్ స్టేడియం చేరుకుని పరిశీలించారు.ముఖ్యమంత్రి జ్ఞానభూమి-ఉపాధికల్పన అంశంపై ముఖ్యమంత్రి చర్చించనున్నారని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు సభాస్థలికి ప్రజలు చేరుకునే మార్గాలను ఈసందర్భంగా తాగునీటి సౌకర్యంతోపాటు ఎండవేడిమి నుంచి రక్షణకు చలువ పందిళ్లు, బారికేడ్లను ఏర్పాటు చేయాలని, ఎలాంటి లోటుపాట్లు తావివ్వకుండా సౌకర్యవంతంగా ఉండేలా చూడాలని కలెక్టరు అధికారులను ఆదేశించారు.  మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులతో ముఖాముఖి ఉన్నందున అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు ఉండాలన్నారు.