ysrkadapa

వార్తలు

బాబు జగ్జీవన్‌రామ్‌కు నివాళులు

భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా కడప తెదేపా నియోజకవర్గ బాధ్యుడు అమీర్‌బాబు పూలమాల వేసి నివాళులు అర్పించారు. కడప కలెక్టరేట్‌ వద్ద ఉన్న జగ్జీవన్‌ విగ్రహం వద్దకు చేరుకున్న అమీర్‌బాబు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బహుజనుల సంక్షేమానికి అవిశ్రాంతంగా కృషి చేశారని, భారత ఉప ప్రధానిగా దేశానికి విశేష సేవలందించిన రాజనీతిజ్ఞుడు, పరిపాలనాదక్షుడు,స్వాతంత్ర్య సమర పోరాట యోధు బాబు జగ్జీవన్ రామ్ అంటూ కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ కడప పార్లమెంట్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు గన్నేపాటి మల్లేశ్, నగర ప్రధాన కార్యధర్శి జలతోటి జయకుమార్, నగర మైనార్టీ అధ్యక్షలు షేక్ ఇమ్రాన్, రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శి సి.ఎస్. నాసర్ ఆలీ, వార్డ్ ఇన్చార్జ్ బండి జయశేఖర్, బీసీ సెల్‌ నాయకుడు గంగాధర్ యాదవ్, ప్రేమ్ కుమార్, చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు..