ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ముస్లిం మైనార్టీలు సద్వినియోగం చేసుకొని ప్రయోజనం పొందాలని జిల్లా కలెక్టర్ హరికిరణ్ అన్నారు. కడపలో మంగళవారం ఉమేష్ చంద్ర కల్యాణ మండపంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు కార్యక్రమాన్న నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి ముస్లింలు అభివృద్ధి చెందాలన్నారు. ప్రొద్దుటూరు, రాయచోటి ప్రాంతాల్లో మైనార్టీల కొరకు నాలుగు రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేశామని, వాటిలో పిల్లలను చేర్పించి ప్రయోజనం పొందాలన్నారు. హజ్‌హౌస్ నిర్మాణం 70 శాతం పూర్తయిందని, 400 మసీదులకు రూ.45 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. అమీన్‌పీర్ దర్గాలో మసీదు నిర్మాణానికి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయని త్వరితగతిన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. రాబోయే రంజాన్ పండుగ నాటికి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. దుల్హన్ పథకం కింద 892 మందికి 50 వేల రూపాయల చొప్పున రూ. 4.46లక్షల చొప్పున కలెక్టర్ చేతుల మీదుగా పంపించేశారు. కార్యక్రమంలో అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి సయ్యద్ ఖాజా అరీపుల్లా హుస్సేని, ఎస్.డి.నయింహస్మి, మున్సిపల్ కమిషనర్ లవన్న, తెదేపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, డీఆర్డీఏ పీడీ రామచంద్రా రెడ్డి, జడ్పీ సీఈవో వెంకటేష్ పరిశ్రమల కేంద్రం జీఎం చాంద్‌బాషా, నాయకులు హరిప్రసాద్, గోవర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు
సంక్షేమ పథకాలతో ప్రయోజనం పొందాలి
