బ్ర‌హ్మంసాగ‌ర్ పరిశీలన

వార్తలు
344 Views

తెలుగుగంగ ప్రాజెక్టు అంత‌ర్బాగ‌మైన బ్ర‌హ్మంసాగ‌ర్ ప్రాజెక్టు సామ‌ర్థ్యంకు త‌గ్గ‌ట్టు ఈ ఏడాది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యూలేట‌ర్ నుండి నీటిని నిల్వ చేయ‌డంతో లీకేజీల ప‌రంప‌రం అందోళ‌న రెకెత్తించింది. ఈ నేప‌థ్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిప‌ల్లె ర‌ఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ గొవింద‌రెడ్డిలు బుధ‌వారం జ‌లాశ‌యంను ప‌రిశీలించారు. జ‌లాశ‌యంలో నీటి సామ‌ర్థ్యంపై తెలుగుగంగ ప్రాజెక్టు ఎస్ఈ శార‌ద‌తో చ‌ర్చించారు. శ్రీశైలం రిజ‌ర్వాయ‌ర్ ను ఈ ఏడాది వ‌ర‌ద‌నీరు ముంచెత్త‌డంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యూలేట‌ర్ ద్వారా వెలుగొడు జ‌లాశ‌యం నుండి తెలుగుగంగ ప్రాజెక్టు అంత‌ర్భాగ‌మైన బ్ర‌హ్మంసాగ‌ర్ జ‌లాశ‌యంకు ఎక్కువ సామ‌ర్థ్యంలో నీటిని నింపారు.

జ‌లాశ‌యం సామ‌ర్ధ్యం 18టీఎంసీలు కాగా.. ప్ర‌స్తుతం 13.5టీఎంసీల నీరు ఉండిపోయింది. జ‌లాశ‌యం నిర్మించిన త‌ర్వాత 2009లో దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి హ‌యంలో 12టీఎంసీల నీరు నిల్వ ఉంచారు.. ఆత‌ర్వాత ఈ ఏడాది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో అంత కంటే అధికంగా 13.5టీఎంసీల నీరు చేరుకుంది. సామ‌ర్థ్యం త‌గ్గ‌ట్టు నీరు జ‌లాశ‌యంకు చేరుకోవ‌డంతో ప్ర‌ధాన క‌ట్ట‌కు లీకేజీకి గురైంది. అధిక మొత్తంలో నీటిని నిల్వ చేయ‌డం వ‌ల్ల క‌ట్ట లీకేజీకి గురికావ‌డం వ‌ల్ల ప‌రిస‌ర ప్రాంత ప్ర‌జ‌ల్లోనూ, రైతాంగంతోపాటు ప్ర‌తిప‌క్ష‌పార్టీలు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశాయి.. ఈ నేప‌థ్యంలో ప్రాజెక్టు లీకేజీలను అధికార‌పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితోపాటు, స్ధానిక ఎమ్మెల్యే శెట్టిప‌ల్లె ర‌ఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ గోవిందరెడ్డిలు బుధ‌వారం ప‌రిశీలించారు.. జ‌లాశ‌యం క‌ట్ట లీకేజీ వల్ల ఇబ్బందులు గురించి, నిర్మూల‌ను గురించి తీసుకోవ‌ల్సిన చ‌ర్య‌లు గురించి తెలుగుగంగ ప్రాజెక్టు ఎస్ఈ శార‌ద‌తో చ‌ర్చించారు.. వెంట‌నే లీకేజీలు నిర్మూలించే చ‌ర్య‌లు వేగ‌వంతంగా చేయాల‌ని వారు అధికారుల‌కు సూచించారు. ప్రాజెక్టు పరిశీలనలో నియోజకవర్గ సమన్వయకర్త శెట్టిపల్లె నాగిరెడ్డి, ప్రభుత్వ రైతు ప్రతినిధి సంబటూరు ప్రసాద్ రెడ్డిలతోపాటు, స్ధానిక వైసీపీ నాయకులు రామగోవిందురెడ్డి, వీరనారాయణరెడ్డి తదితరులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *