లలితకళల విశ్వవిద్యాలయం ఏర్పాటుకు భూముల పరిశీలన

126 Viewsకడప నగర సమీప చిన్నచౌకు ప్రాంత చలమారెడ్డిపల్లె సమీప కొండగుట్ట ప్రాంతంలో రాష్ట్రస్థాయి లలితకళల యూనివర్సిటీ (స్టేట్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ) ఏర్పాటుకు శనివారం జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ క్షేత్రస్థాయి స్థల పరిశీలన చేశారు. దాదాపు 134 ఎకరాల విస్తీర్ణంలో విశ్వవిద్యాలయం ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించారు. చిన్నచౌకు పరిధిలో 94 ఎకరాలు, సిద్ధవటం మండలానికి సంబంధించి 40 ఎకరాలు కలవడం జరుగుతోంది. కొండ గుట్ట పైన మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తూ… చుట్టూ పచ్చదనం […]

Continue Reading

ఒంటిమిట్ట

343 Viewsకడప నుంచి 20కి.మీ దూరంలో రాజంపేట మీదుగా తిరుపతికి వెళ్ళే దారిలో ఒంటిమిట్ట కోదండరామాలయం నెలకొని ఉంది. ఇక్కడి కోదండ రామాలయంలోని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్టించాడు. ఒకే శిలలో శ్రీరామ, సీత, లక్ష్మణుని చూడవచ్చు. ఒకే శిలపై విగ్రహాలు ఉండటంతో ఒంటిమిట్ట క్షేత్రం ఏకశిలానగరంగా ప్రసిద్ధి చెందింది. దేవాలయంలో శ్రీరామ తీర్ధం ఉంది. సీత కోరికపై శ్రీ రాముడు రామబాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని స్థల పురాణంలో వివరించబడింది. గోపుర నిర్మాణము చోళ శిల్ప […]

Continue Reading

నందలూరు

332 Viewsకడప-చెన్నై రహదారిలో కడపకు 45 కి.మీ దూరంలో చెయ్యేరు ఒడ్డున వెలసిన పట్టణమది. 14 ఎకరాల స్థలంలో నిర్మించిన సౌమ్యనాధ స్వామి ఆలయం ప్రసిద్ిర చెందింది. 11వ శతాబ్దంలో చోళవంశరాజు కులోత్తుంగ చోళుడు ఈ ఆలయ నిర్మించినట్లు తెలుస్తోంది. మూడు రాజగోపురాలు, కోనేరుతో ప్రత్యేక అందాన్ని సంతరించుకుంది. నందలూరు సమీప అడపూరు వద్ద బౌద్ధ ఆరామాలు, బౌద్ధ స్తూపాలు ఉన్నాయి.

Continue Reading