జన్మించినపుడు అందరూ శూద్రులే

1,014 Viewsజన్మకాలమందు సర్వులు శూద్రులు మంత్రతంత్రములను మారె కులము శుద్ధిమంతుడాయె శూద్రుండు గురుదీక్ష కాళికాంబ!హంస!కాళికాంబ పుట్టినప్పుడు అందరూ శూద్రులే. తర్వాత మంత్రతంత్రాల వల్ల కులం మారింది. శూద్రుడు గురుదీక్ష తీసుకొని శుద్ధిమంతుడయ్యాడు. బ్రహ్మంగారు భారతీయ సమాజాన్ని సహస్రబ్దాలుగా శాసిస్తున్న కులవ్యవస్థ మూలాలను అన్వేషించారు. ఆధిపత్యవర్గాలు కులవ్యవస్థను శాశ్వతం చేసి అధికసంఖ్యలో జనాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోడానికి దానికి దైవకర్తృత్వాన్ని ఆపాదించి ప్రశ్నించకుండా జాగ్రత్తపడ్డాయి. దేవుడే వర్ణ, కుల సృష్టికర్త అయితే ఎదిరించడం దైవ వ్యతిరేకతగా ప్రచారం చేశాయి. […]

Continue Reading

భక్తి లేకుండా జ్ఞానం ఫలం లభించదు

898 Viewsతిలలరసము లేక దీపమ్ము వెలుగదు పూవులేక ఫలము పుట్టబోదు భక్తిలేక జ్ఞానఫలము లభింపదు కాళికాంబ!హంస!కాళికాంబ! నువ్వులనూనె లేకుండా దీపం వెలగదు. పువ్వు లేకుండా పండు పుట్టదు. అలాగే భక్తి లేకుండా జ్ఞానం అనే ఫలం లభించదు. ఈపద్యంలో బ్రహ్మంగారు జ్ఞానార్జనలో ఉండవలసిన నిబద్ధతను ప్రతిపాదించారు. దేనిని నీవు నమ్ముతున్నావో, దేనిని నీవు కోరుతున్నావో దానిమీదనే దృష్టిని కేంద్రీకరించడాన్ని భక్తి అనుకుందాం. జ్ఞానం దొరకాలంటే అది అలవోకగా దొరకదు. ప్రయత్నించి సాధించాలి. “ఏదీ తనంతతానై నీదరికి రాదు, […]

Continue Reading

అన్ని ప్రాణులలో ఉండే ఆత్మ ఒక్కటే

1,234 Views అన్ని తనువులందు నాత్మ యొక్కటియని చర్చచేసి పలువురర్చకులుగ వారివారి యిచ్చవచ్చినట్లుందురు? కాళికాంబ!హంస!కాళికాంబ! అన్ని ప్రాణులలో ఉండే ఆత్మ ఒక్కటే అని పలువురు చర్చలు చేస్తారు. కానీ ఆతర్వాత ఎవరికి ఇష్టమొచ్చినట్లు వాళ్ళు ఉంటారు. బ్రహ్మంగారు భారతీయ సామాజిక వాస్తవికతను చాలా నిశితంగా పరిశీలించారు. భారతీయ తత్త్వశాస్త్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజల జీవితాచరణనూ గమనించారు. ముఖ్యంగా సామాజిక నిచ్చెన మీద పైమెట్టు మీద ఉన్నవాళ్ళు మిగతాజనానికి చెప్పే నీతులు వాళ్ళ వాస్తవిక ఆచరణలు జాగ్రత్తగా పరిశీలించారు. […]

Continue Reading

రావణునకు నెపుడు రాముడు సరిగాడు

1,030 Viewsరావణునకు నెపుడు రాముడు సరిగాడు రావణునకు మిగుల రంకువచ్చె సీత నరిమిపట్ట చేటు లంకకు వచ్చె కాళికాంబ!హంస!కాళికాంబ! శ్రీరాముడు ఎప్పుడూ రావణునితో సమానం కాదు. అయితే రావణుడు సీతను అపహరించి నిర్బంధించడం వల్ల అతనికి రంకుతనం అంటుకుంది. అంతేకాదు రావణుని రాజ్యమైన లంకకు చేటు తెచ్చింది. బ్రహ్మంగారు ప్రపంచ ప్రసిద్ధి చెందిన రెండు భారతీయ పౌరాణిక పాత్రలను తీసుకొని వాటి వ్యక్తిత్వాలను, వాటిలోని భేదసాదృశ్యాలను తులనాత్మకంగా అధ్యయనం చేసి , వాటి పరిణామాలను చెప్పారు. బ్రహ్మంగారు […]

Continue Reading