ysrkadapa

వార్తలు

చంద్రబాబు అభినవ పులకేశి

రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే నిరుద్యోగ యువతకు ఉపాధి , ఉద్యోగ అవకాశం కల్పించాలన్నదే సీఎం జగన్ ఆశయమని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. వైఎస్సార్‌ జిల్లా చాపాడు సమీప సీబీఐటీలో ఉద్యోగమేళ ఏర్పాట్ల సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రంలో మూడు మెగా జాబ్ మేళాలతో 40 వేల మందికి ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. రాష్ట్రం సర్వతోముఖభివృద్ది సాధించాలన్నదే ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆశయమన్నారు. చంద్రబాబు 14పదవీ కాలంలో 60 ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసి ఉద్యోగాలు ఊడేలా చేశారని పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వంలో గ్రామ సచివాలయం , వైద్య , రవాణా రంగాల్లో దాదాపు ఐదు లక్షల మందికి ఉద్యోగ అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఉద్యోగాలు కల్పిస్తున్న వైకాపా ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు చంద్రబాబుకు లేదని అభినవ పులకేశి అంటూ అభివర్ణించారు. సామాజిక న్యాయం జరిగేలా దేశ అధ్యక్ష పదవికి ఎస్టీ మహిళకు ముఖ్యమంత్రి మద్దతు ప్రకటించారని తెలిపారు. లోకేష్ విమర్శలు అర్థరహితమన్నారు.