ramachandraiahతెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన చెన్నంశెట్టి రామ‌చంద్ర ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంతో ఆపార్టీలో చేరారు. కాంగ్రెస్‌లో విలీనం త‌ర్వాత శాస‌న‌మండ‌లికి ఎన్నిక‌య్యారు. శాసనమండలిలో ప్రతిపక్షనేత హోదా పొందారు.కిర‌ణ్‌కుమార్‌రెడ్డి మంత్రి వ‌ర్గంలో దేవాదాయ‌శాఖ మంత్రిగా పని చేశారు.1967-68లో సిండికేట్ బ్యాంకులో క్లర్క్‌గా విధులు నిర్వహించిన రామ‌చంద్ర 1978లో క‌డ‌ప పుర‌పాలిక‌లో చెమ్ముమియాపేట వార్డు కౌన్సిల‌ర్‌గా తెలుగుదేశం పార్టీ త‌ర‌పున పోటీ చేసి 871 ఓట్ల ఆధిక్యత సాధించి రాష్ట్రంలోనే అత్యధిక ఓట్ల సాధించిన వారు కౌన్సిల‌ర్‌గా రికార్డు సాధించారు. 1985లోక‌డ‌ప అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓట్ల ఆధిక్యత సాధించారు. 1986 నుంచి 1988 వ‌ర‌కు 20 సూత్రాల అమ‌లు మంత్రిగా ప‌నిచేశారు. 1988-89 వ‌ర‌కు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ ఛైర్మన్‌గా ఉన్నారు. 1999 నుంచి 2009 వ‌ర‌కు రెండుసార్లు రాజ్యస‌భ స‌భ్యునిగా ఉన్నారు. 2001-04 వ‌ర‌కు పార్లమెంట‌రీ జ‌న‌ర‌ల్ ప‌ర్పస్ క‌మిటి స‌భ్యుడిగానూ, 2002-04 వ‌ర‌కు తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడ‌ర్‌గానూ ఉన్నారు.2004-06 వ‌ర‌కు పార్లమెంట‌రీ ప‌బ్లిక్ అకౌంట్ క‌మిటి స‌భ్యుడిగా ఉన్నారు. బ‌లిజ సామాజిక వ‌ర్గానికి చెందిన రామ‌చంద్రయ్య 2008లో ప్రజారాజ్యం ఆవిర్భావంతో పార్టీ ఫిరాయించారు. 2009 జ‌న‌వ‌రిలో రాజ్యస‌భ స‌భ్యత్వానికి రాజీనామా చేసిన రామ‌చంద్రయ్య ప్రజారాజ్యంలో క్రియాశీల‌క పాత్ర పోషించారు. 18-03-2011 శాస‌న‌మండ‌లికి ఎన్నిక‌య్యారు.