చెన్నూరు సమీపం చిన్నమాచుపల్లె వద్ద జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీప బేస్తవారిపేటకు చెందిన భాగ్యలక్ష్మి, మస్తాన్‌రావులు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మస్తాన్‌రావుకు గుండె ఆపరేషన్‌ కోసం బెంగుళూరుకు కారులో వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగింది.  గాయపడిన వారిని కడప రిమ్స్‌కు తరలించారు.