చెయ్యేరు న‌దికి పేరు ఆపేరు రావ‌డానికి వెనుక ఒక క‌థ ఉంది. శంఖ, లిఖితుడు అనే ఇద్దరు అన్నదమ్ములు న‌దికి ఒక‌వైపు ఒకరు, మ‌రోవైపు మ‌రొక‌రు ఉండే వారు. తమ్ముడు లిఖితుడు ప్రతిరోజూ అన్న వద్దకు వచ్చి వేద శాస్త్రములు నేర్చుకునేందుకు వెళ్ళేవాడు. ఒకరోజు లిఖితుడు దారి వెంట నడుస్తూ ఉండ‌గా ఆకలి వేయ‌డంతో ఒడ్డునే ఉన్న మామిడి తోట కేసి చూశారు. తోట యజమాని క‌నిపించ‌క పోవ‌డంతో ఆక‌లి తాళ‌లేని లిఖితుడు పళ్ళు కోసుకుని తిని విషయం అన్న శంఖుకు చెప్పారు. చేసింది నేరమని పొత్తపి రాజు ర‌వివ‌ర్మ వద్దకు వెళ్ళి శిక్షను కోర‌మ‌న్నాడు. రాజు లిఖితుడి చేతులు ఖండించాడు. తెగిన చేతులతో అన్న వ‌ద్దకు వచ్చాడు లిఖితుడు. శంఖుడు దైవాన్ని ప్రార్థించి చేతులు న‌దిలో ముంచాల్సిందిగా చెప్పాడు. లిఖితుడు అలాగే చేశారు. చేతులు వచ్చాయి. చేతులను రప్పించిన ఆ నదికి ‘చెయ్యేరు’ అని పేరు వ‌చ్చిన‌ట్లు ప్రచారంలో ఉంది. ‘బాహు’ అంటే సంస్కృతంలో చెయ్యి అని అర్థం. ‘ద’ అంటే ఇచ్చునది. అందుకే బాహుద న‌ది అయింది.

చెయ్యేరు యొక్క ఉపనదులు : బ‌హుదా, పింఛ‌, మండ‌లి, పుల్లంగి, గుంజ‌న‌