బ్రిటీష్ కాలంలో భారతదేశంలో ‘కడ’తో మొదలయ్యే గ్రామాల పేరు స్పెల్లింగును ఆంగ్లంలో ‘Cudda’ అని వాడారు. కడప స్పెల్లింగు Cuddapah, తమిళనాడులోని కడలూరు స్పెల్లింగు Cuddalore అలా వచ్చినవే. 2004లో జిల్లా వాసి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2005 ఆగస్టు 19న ‘CUDDAPAH’ స్పెల్లింగును ‘KADAPA’గా మార్పు చేసి సౌకర్యంగా ఉండేలా అధికారికంగా మార్పు చేశారు.