మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి మృతి

రాజకీయం వార్తలు
78 Views
మైదుకూరు మాజీ శాసనసభ్యుడు పాలకొలను నారాయణ రెడ్డి (84) సోమవారం హైదరాబాదులో కన్ను మూశారు. 1962-67 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మైదుకూరు నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహించిన నారాయణరెడ్డి పోరుమామిళ్ల మండలం అక్కలరెడ్డిపల్లె జన్మించారు. బీఏఎల్‌ఎల్‌బీ చదివి మొదట న్యాయవాద వృత్తిని చేపట్టి అనంతరం రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1967లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి పి.ఎల్.రెడ్డిపై దాదాపు 5717 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. నారాయణరెడ్డికి 19,119 ఓట్లురాగా పి. ఎల్. రెడ్డికి 13,402 ఓట్లు వచ్చాయి.
తల్లి పిచ్చమ్మ
తండ్రి వెంకటసుబ్బారెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *