ఉపముఖ్యమంత్రికి గజమాలతో సత్కారం

వార్తలు
168 Views

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషను సంచార కుల కార్పొరేషన్ డైరెక్టర్ కరీముల్లా ఆధ్వర్యంలో మైనార్టీ కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. ఆదివారం కడప నగరంలోని అంజాద్ బాషా నివాసం వద్ద సత్కరించిన కరీముల్లా ఈ సందర్బంగా కరీముల్లా మాట్లాడుతూ ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా మైనార్టీల అపర భగీరథుడు అని కొనియాడారు. కర్నూలు జిల్లా, గూడూరు మండలంలోని మల్లాపురం గ్రామ పరిధిలోని 50 ఎకరాల వక్ఫ్ బోర్డు భూములకు గత 20 ఏళ్లుగా సాగునీరందక అవస్థలు పడుతున్న మైనారిటీ రైతుల భూములకు నీరందించి కష్టాలను తీర్చారన్నారు. గురురాఘవేంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించేందుకు చూపిన చొరవ ప్రశంసనీయమన్నారు. మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పెద్దపీట వేశారని, ముస్లిం మైనార్టీలు ఎల్లవేళలా ఋణ పడివుంటారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *