అభివృద్ధి.. సంక్షేమం… రెండు కళ్ళు

వార్తలు
159 Views
అభివృద్ధి.. సంక్షేమం… ప్రభుత్వానికి రెండు కళ్ళు లాంటివని, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదిశగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్బాష అన్నారు. శనివారం ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్ రెడ్డి తమ సుదీర్ఘ పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే ప్రజలకిచ్చిన హామీలను 90శాతం నెరవేర్చారని, ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా సంక్షేమ ఫలాలు పేదల ముంగిటకు చేర్చారన్నారు. కరోనా కష్టకాలంలో ప్రభుత్వానికి ఆదాయం లేకపోయినా ప్రజలకిచ్చిన మాట మేరకు హామీలను నెరవేర్చుతున్నారని వివరించారు. సంక్షేమ పథకాల అమలులో మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని, ఏడాది కాలంలోనే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించారన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగే అభివృద్ధిపై 80 శాతం పైగా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. కరోనా కష్టకాలంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎలా అమలు చేస్తున్నారని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 13 జిల్లాలను రాబోయే రోజులలో 25 జిల్లాలుగా పెంచబోతున్నామన్నారు. జిల్లాలు పెంచడం వల్ల ప్రజలకు మరింత అందుబాటులో పరిపాలన ఉంటుందన్నారు. ప్రతి గ్రామం పట్టణానికి సమానంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల నిర్మించేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *