నవ నిర్మాణ దీక్షలో భాగంగా ప్రొద్దుటూరు మండలం చెన్నమరాజుపల్లెలో నిర్వహించిన గ్రామసభ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించిన మేరకు ఏడుగురికి సోమవారం జిల్లా కలెక్టరు హరికిరణ్‌ రూ.25వేలు చొప్పున మీకోసం కార్యక్రమంలో చెక్కులను అందజేశారు. ప్రొద్దుటూరు మండలం నాగాయపల్లెకు చెందిన మతిస్థిమితం లేని ఎం.గాయత్రి, కె.సునీత, జి.గుర్రమ్మ, వృద్ధురాలైన శివమ్మకు, అనాధ కుటుంబాలైన వేణు, ఎం.సునీత కుటుంబాలకు, క్యాన్సర్‌తో బాధపడుతున్న చెన్నమరాజుపల్లెకు చెందిన వి.పిచ్చమ్మకు రూ. 25వేలు చొప్పున చెక్కులను పంపిణీ చేశారు.