విలువలతో కూడిన విద్య

రాచపాలెం
384 Views

ప్రాథమిక స్థాయి నుంచే విలువలతో కూడిన విద్యను భోదించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విద్యాశాఖాధికారులను ఆదేశించారు.  ఉన్న స్థితి నుండి -ఉన్నత స్థితికి (నాడు -నేడు) పై శనివారం కలెక్టరేట్ సభాభవన్లో విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం  నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ నాణ్యత, విలువలతో కూడిన విద్యను ఒకటో తరగతి నుంచే అందించాలన్నారు.  ముఖ్యమంత్రి దిశా నిర్దేశం మేరకు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు ఇచ్చే ఆదేశాలను  అమలు బాధ్యత క్షేత్ర స్థాయిలో పనిచేసే అధికారులదేనన్నారు.  విద్యా వ్యవస్థను గాడిలో పెట్టి, విలువలతో కూడిన విద్యను అందించాలన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశ్యమన్నారు.  విద్యాశాఖ బలోపేతం చేసేందుకు రాష్ట్ర బడ్జెట్లో 15.75 శాతం  నిధులు కేటాయించారన్నారు. అమ్మఒడి, నాడు – నేడు, రెగ్యులేటరీ కమిషన్ ఇలా వినూత్నమైన ఆలోచనలతో ముఖ్యమంత్రి ముందుకు వెళ్తున్నారన్నారు.  ఉపాధ్యాయలు, విద్యార్థుల రేషియో మేరకు ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తామన్నారు.  పారదర్శకంగా, అవినీతి రహితంగా, జవాబుదారీతనంతో సుపరిపాలన అందించాలన్నదే ముఖ్యమంత్రి ఆశయమన్నారు. విద్యా ప్రమాణాలను పెంచి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే శక్తి ఉపాధ్యాయులకే ఉందన్నారు.  గుడ్లు, యూనిఫామ్, షూస్… విద్యార్థులకు అందించేందుకు  టెండర్ల ద్వారా సేకరించే అంశాన్ని  జిల్లా పరిధిలోకి తీసుకు వచ్చామన్నారు.  ఒక వైపు నాణ్యమైన విద్యను అందించేందుకు అవసరమైన అన్ని మౌలిక అంశాలను మెరుగు పరుస్తూ, మరోవైపు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరానికి చర్యలు తీసుకుంటున్నదన్నారు.  ఎంతో కాలం అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసులను పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలిపారు. విద్యాశాఖలో ప్రమాణాలు పెంచి, పాఠశాలలను బలోపేతం చేసేందుకు సహకారం కావాలని అధికారులను కోరారు. తల్లిదండ్రుల కమిటీలను ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు.  మధ్యాహ్న భోజన వర్కర్లకు జీతాలు పెంచామన్నారు.  ఉన్నత పాఠశాలల్లో వాచ్‌మెన్‌  పోస్టులను భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు.  జిల్లాలోని పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు కేంద్రీకృత కిచెన్ లు ఏర్పాటు చేసేందుకు రెండు ఎకరాలు స్థలం కావాలని, కలెక్టర్ సహకారంతో గుర్తించాలని డీఈవో ను ఆదేశించారు.  అమ్మఒడి పథకం అమలుకు త్వరలో విధి విధానాలను పంపుతామన్నారు.  అన్ని పాఠశాలల్లో ప్రతి నెల మొదటి శనివారం, మూడవ శనివారం నో బ్యాగ్ డే తప్పనిసరిగా అమలు కావాలన్నారు.
రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ మాట్లాడుతూ ఒకటో తరగతి నుంచే అన్ని సబ్జెక్టులలో బాగా చదివే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. ముక్యంగా చదువులో వెనుకబడిన వారిని, ఎటువంటి ప్రోత్సాహం లేని వారిని గుర్తించి అర్థమయ్యే రీతిలో వారికి బోధించి ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలన్నారు.  దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో ఒక విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో రెగ్యులేటరీ కమిషన్ ను ప్రభుత్వం నియమిస్తున్నదన్నారు. జిల్లాలో ఉన్న 4600 పాఠశాలలలో 4.42 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని జిల్లా పాలనాధికారి మంత్రికి వివరించారు. వైఎస్సార్‌  కంటి వెలుగు పథకం కింద కంటి పరీక్షలను చేయిస్తున్నామన్నారు. విద్యా, వైద్య అధికారుల సమన్వయం తో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు దాదాపు 86 శాతం మంది విద్యార్థులకు కంటి పరీక్షలను  నిర్వహించి రాష్ట్రంలో 5వ స్థానం లో ఉన్నట్లు పేర్కొన్నారు.  మిగిలిన వారికీ కంటి పరీక్షలను పూర్తి చేస్తామన్నారు.  మన బడి నాడు – నేడు కార్యక్రమం కింద తాగునీరు, విద్యుత్తు, పంకాలు మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.  మౌలిక వసతుల కల్పనకు ఉపాధి హామీ పథకం ను అనుసంధానిస్తే  బాగుంటుందని మంత్రి దృష్టికి తెచ్చారు.  జిల్లాలోని  4.42 లక్షల మంది విద్యార్థులకు సంభందించి దాదాపు 2.50 లక్షల  మంది తల్లులు  అమ్మఒడి పథకం ద్వారా లబ్ది పొందనున్నారని వివరించారు. కార్యక్రమంలో  ఆర్జేడీ కృష్ణా రెడ్డి, డీఈవో శైలజ,  ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆర్జేడీ చంద్ర శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ కత్తి నరసింహా రెడ్డి, కమలాపురం, బద్వేల్ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, డా.వెంకట సుబ్బయ్య,  రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *