మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గం

మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గ ఎన్నికల చరిత్ర

వార్తలు
546 Views

మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గం 1955లో ఏర్పాటైంది. ఇప్పటిదాకా 13సార్లు ఎన్నిక‌లు జరిగాయి. నియోజ‌క‌వ‌ర్గంలోని బీమ‌ఠం మండ‌లానికి చెందిన బొమ్ము రామారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.  వైఎస్సార్‌సీపీ నాయ‌కుడు,  ఎమ్మెల్యే ఎస్‌.ర‌ఘురామిరెడ్డి పెద‌నాన్న పెద్దనాగిరెడ్డి 1972లో ఏక‌గ్రీవంగా ఎన్నికై చ‌రిత్ర సృష్టించారు. 1978లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రాజ‌కీయ రంగ‌ప్రవేశం చేసి పోటీ చేసి గెలుపొందిన  డి.ఎల్‌.ర‌వీంద్రారెడ్డి ఆత‌ర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎనిమిది సార్లు పోటీ చేసి ఆరుసార్లు గెలుపొందారు. ఆరుస్లార్లు గెలుపొందిన కొద్దిమందిలో రవీంద్రారెడ్డి ఒకరు. నియోజ‌క‌వ‌ర్గంలో అతి త‌క్కువ ఓట్లు (1994లో కేవ‌లం 24 ఓట్లు మాత్రమే) భారీ ఆధిక్యతతో (1989లో 33358 ఓట్లు) విజయం సాధించిన ఎమ్మెల్యేగా  రికార్డు సృష్టించిన ఘ‌న‌త ర‌వీంద్రారెడ్డికే ద‌క్కుతుంది.  రవీంద్రారెడ్డి రాజకీయ ప్రవేశం నుంచి వరుసగా రెండుసార్లు గెలుపు, ఒకసారి ఓటమిని చూవిచూస్తూ వచ్చారు. ముఖ్యమంత్రులుగా ప‌నిచేసిన ఎన్‌.జ‌నార్ధన్‌రెడ్డి, కోట్ల విజ‌య‌భాస్కర‌రెడ్డి, కిర‌ణ్‌కుమార్‌రెడ్డిల హ‌యాంలో ప‌లుమార్లు మంత్రి ప‌ద‌వులు నిర్వహించారు. 1992లో మైదుకూరులో జ‌రిగిన క‌ల్తీ మ‌ద్యం సంఘ‌ట‌న‌లో  వైద్య, ఆరోగ్యశాఖ ప‌ద‌వికి రాజీనామా చేశారు. కిర‌ణ్‌కుమార్‌రెడ్డి హ‌యాంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఉంటూ భ‌ర్తర‌ఫ్‌కు గుర‌య్యారు.

2014లో

మొత్తం ఓట్లు 1,95,092
విజేత ఆధిక్యత 11,522
విజేత ఎస్‌.రఘురామిరెడ్డి వైకాపా 85,539
సమీప అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్‌ తెదేపా 74,017

2009లో

మొత్తం ఓట్లు 1,77,694
విజేత ఆధిక్యత 4,361
విజేత డి.ఎల్‌.రవీంద్రారెడ్డి కాంగ్రెస్‌ 62,377
సమీప అభ్యర్థి ఎస్‌.రఘురామిరెడ్డి తెదేపా 58,014

2004లో

మొత్తం ఓట్లు 1,39,291
విజేత ఆధిక్యత 7,881
విజేత డి.ఎల్‌.రవీంద్రారెడ్డి కాంగ్రెస్‌ 54,270
సమీప అభ్యర్థి ఎస్‌.రఘురామిరెడ్డి తెదేపా 46,389

1999లో

మొత్తం ఓట్లు 1,228,824
విజేత ఆధిక్యత 5,700
విజేత ఎస్‌.రఘురామిరెడ్డి తెదేపా 48,135
సమీప అభ్యర్థి ఎస్‌.రఘురామిరెడ్డి కాంగ్రెస్‌ 42,615

1994లో

మొత్తం ఓట్లు 1,36,599
విజేత ఆధిక్యత 28
విజేత డి.ఎల్‌.రవీంద్రారెడ్డి కాంగ్రెస్‌ 47,046
సమీప అభ్యర్థి ఎస్‌.రఘురామిరెడ్డి తెదేపా 47,018

1989లో

మొత్తం ఓట్లు 1,40,217
విజేత ఆధిక్యత 33,358
విజేత డి.ఎల్‌.రవీంద్రారెడ్డి కాంగ్రెస్‌ 68,577
సమీప అభ్యర్థి ఎస్‌.రఘురామిరెడ్డి తెదేపా 35,219

1985లో

మొత్తం ఓట్లు 1,15,185
విజేత ఆధిక్యత 3,695
విజేత ఎస్‌.రఘురామిరెడ్డి తెదేపా 43,857
సమీప అభ్యర్థి డి.ఎల్‌.రవీంద్రారెడ్డి కాంగ్రెస్‌ 40,162

1983లో

మొత్తం ఓట్లు 1,01,446
విజేత ఆధిక్యత 5067
విజేత డి.ఎల్‌.రవీంద్రారెడ్డి కాంగ్రెస్‌ 42,185
సమీప అభ్యర్థి పాలగిరి నారాయణరెడ్డి స్వతంత్ర 37,118

1978లో

మొత్తం ఓట్లు 93,329
విజేత ఆధిక్యత 335
విజేత డి.ఎల్‌.రవీంద్రారెడ్డి స్వతంత్ర 22,181
సమీప అభ్యర్థి శెట్టిపల్లె చిన్న నాగిరెడ్డి జనతా 21,846

1972లో

మొత్తం ఓట్లు 98,535
విజేత ఆధిక్యత ఏకగ్రీవం
ఏకగ్రీవం శెట్టిపల్లె పెద్దనాగిరెడ్డి కాంగ్రెస్‌

1967లో

మొత్తం ఓట్లు 79,350
విజేత ఆధిక్యత 809
విజేత శెట్టిపల్లె పెద్ద నాగిరెడ్డి కాంగ్రెస్‌ 28,368
సమీప అభ్యర్థి గంగవరం రామిరెడ్డి స్వతంత్ర 27,559

1962లో

మొత్తం ఓట్లు 76,430
విజేత ఆధిక్యత 5,734
విజేత పాలకొలను నారాయణరెడ్డి స్వతంత్ర 19,119
సమీప అభ్యర్థి పెద్దిరెడ్డి లక్ష్మీనరసింహారెడ్డి సీపీఐ 13,385

1955లో

మొత్తం ఓట్లు 62,997
విజేత ఆధిక్యత 11,804
విజేత బొమ్ము రామారెడ్డి స్వతంత్ర 26,522
సమీప అభ్యర్థి వడ్డమాని చిదానందం స్వతంత్ర 14,748

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *