ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి

వార్తలు
327 Views
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పట్టణంలో పచ్చదనాన్ని పెంపొందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి. అంజాద్బాష అన్నారు. శనివారం సింగపూర్‌సిటీలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ మొక్కలు కార్బన్ డై ఆక్సైడ్ ను పీల్చుకుని ఆక్సిజన్ ను విడుదల చేస్తాయన్నారు. మొక్కల వల్ల మానవాళికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ మొక్క యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఖాళీ ప్రాంతాలలో ఇంటి పరిసర ప్రాంతాల్లో విరివిగా మొక్కలు నాటాలన్నారు. పట్టణంలో రోజురోజుకు కాలుష్యం పెరుగుతోందని, కాలుష్యాన్ని నివారించాలంటే తప్పకుండా మొక్కలు నాటాలన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో మొక్కలు నాటడంతో అవి బాగా పెరిగే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ సూర్యనారాయణ, సింగపూర్ టౌన్ టౌన్ షిప్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రమోహన్ రెడ్డి, సభ్యులు రమణయ్య, విశ్వనాథరెడ్డి, గుర్రప్ప, 31వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి అజ్మతుల్లా, డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, డాక్టర్ నారాయణ రెడ్డి, వైకాపా నాయకులు దాసరి శివప్రసాద్, నగర మైనార్టీ సెల్ అధ్యక్షులు షఫీ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *