ysrkadapa

వార్తలు

సివిల్స్‌ లో రైతుబిడ్డ ప్రతిభ

సాధారణ రైతు కుటుంబంలో పుట్టారు.. తండ్రి రైతు అయిన‌ప్ప‌టీకీ చ‌దువులో అద్వితీయ ప్ర‌తిభ క‌న‌ప‌రిచారు. చ‌దువు ప్ర‌స్ధానంలో వెన‌క్కు తిరిగి చూడ‌కుండా రెండ‌వ ప్ర‌య‌త్నంలోనే సివిల్స్ విజేత‌గా నిలిచాడు. స‌ర‌స్వ‌తిపుత్రుడైన ఆ అబ్బాయే క‌డ‌ప జిల్లా మైదుకూరు పుర‌పాలిక ప‌రిధిలోని చిన్న‌య్య‌గారిప‌ల్లెకు చెందిన చీమ‌ల శివ‌గోపాల్ రెడ్డి.‌

పదోతరగతి వరకు ప్రయివేట్ వైపు దృష్టి మ‌ళ్లించ‌కుండా.. తల్లిదండ్రుల చెంత‌నే ఉంటూ త‌మ ప‌ల్లె ప‌ట్టునే ఉన్న ప్ర‌భుత్వ బ‌డిలో చ‌దువుకున్నాడు..త‌న ప‌ల్లె ప‌క్క‌నున్న శెట్టివారిప‌ల్లె జ‌డ్పీ హైస్కూల్ నందు 2012 విద్యాసంవ‌త్స‌రంలో ప‌ద‌వ‌త‌ర‌గతి పూర్తి చేశారు.. ప‌ద‌వత‌ర‌గ‌తిలో 9.8 గ్రేడ్ సాధించారు. మార్కుల ప్రాతిప‌దిక‌న ఇడుపుల‌పాయ‌లోని ట్రిబుల్ ఐటీలో ఎంపిక‌య్యారు.. కెమిక‌ల్ ఇంజ‌నీరింగ్ ఆరేళ్లు చ‌దివారు.. ఫైన‌ల్ ఇయ‌ర్ నుండే సివిల్స్ పై దృష్టి పెట్టారు. ఇడుపుల‌పాయ‌లో చ‌దువు పూర్తి కాగానే..ఇంజ‌నీరింగ్ ప‌ట్టా చేత‌ప‌ట్టుకుని..దిల్లీకి వెళ్లాడు.. అక్క‌డ శిక్ష‌ణ తీసుకుంటూ.. సివిల్స్ మొద‌టి ప్ర‌య‌త్నంను తన అనుభ‌వంగా మార్చుకుని.. రెండ‌వ ప్ర‌య‌త్నంలో త‌న అస‌మాన ప్ర‌తిభ‌ను క‌న‌ప‌రిచి విజేత‌గా నిలిచారు.. .. ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని ,.. మైదుకూరు ప్రాంతంను దేశ స్ధాయిలో చాటింపు చేశారు ‘చీమల శివగోపాల్ రెడ్డి’ సివిల్స్ పరీక్షలో ఆల్ ఇండియాలో 263 ర్యాంక్ సాధించారు.

రైతు బిడ్డ చీమ‌ల శివారెడ్డి, రేవ‌తిల మూడ‌వ సంతానం శివగోపాల్ రెడ్డి. మ‌క్కొండ మ‌ల్లేశ్వ‌రుడు ఈ కుటుంబానికి ఇల‌వేల్పు.ఆదేవాల‌య బాధ్య‌త‌లు ఆ కుటుంబ‌మే నిర్వ‌హిస్తూ వ‌స్తోంది. శివ‌గోపాల్ రెడ్డి అబ్బ చీమ‌ల అబ్బిరెడ్డి.. అంద‌రికీ సుప‌రిచితుడు.. తండ్రి శివారెడ్డికి వ్య‌వ‌సాయ‌మే జీవ‌నాధారాం. శివారెడ్డికి ముగ్గ‌రు బిడ్డ‌లు.. మొద‌టి బిడ్డ శివ‌జ్యోతి. అదే గ్రామానికి చెందిన అంకిరెడ్డిప‌ల్లి న‌రేంద్ర‌రెడ్డికి కూత‌రుని ఇచ్చి పెండ్లి చేశాడు.. రెండ‌వ బిడ్డ శివానంద‌రెడ్డి సాప్ట్ వేర్ ఇంజ‌నీర్‌. మూడ‌వ బిడ్డ సివిల్ విజేత శివ‌గోపాల్ రెడ్డి. శివారెడ్డి రైతు బిడ్డ కావ‌డంతో త‌న కొడుకు చ‌దువు బాధ్య‌త‌లు త‌న అల్లుడైన అంకిరెడ్డిప‌ల్లె న‌రేంద్ర‌రెడ్డి కి అప్ప‌గించారు.. పోలీసుశాఖ‌లో ఇంట‌లిజెంట్స్ లో పోలీసు కానిస్టేబుల్ గా ప‌నిచేస్తున్న న‌రేంద్ర‌రెడ్డి ఒక విధంగా చెప్పాలంటే సివిల్స్ లో ప్ర‌తిభ క‌న‌ప‌రిచిన శివ‌గోపాల్ రెడ్డికి గురువు అని చెప్ప‌వ‌చ్చు. త‌ల్లిదండ్రులు చ‌దువుకున్న‌ప్ప‌టికీ త‌న బావ న‌రేంద్ర‌రెడ్డి సూచ‌న‌ల మేర‌కే చదువుపై ఏకాగ్ర‌త పెట్టారు.

సివిల్స్‌పై దృష్టి..
ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి దేశ అత్యున్నత సర్వీసుల్లో అడుగుపెట్టడం ప్రతి ఒక్క విద్యార్థి స్వప్నం! ఒక్కమాటలో చెప్పాలంటే.. ప్రతిభావంతులైన యువత కలల సౌధం.. సివిల్ సర్వీసెస్! ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ.. మూడంచెల సివిల్స్ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించాలంటే.. అడుగడుగునా అప్రమత్తంగా ఉండాలి. విస్తృతమైన సిలబస్‌ను ఔపోసన పట్టేందుకు.. పటిష్ట వ్యూహం, ప్రణాళికాబద్ద ప్రిపరేషన్‌తోపాటు ప్రశాంతమైన పట్టుదలతో ముందడుగేయాలి..అదే సిద్ధాంతంను అల‌వ‌ర్చుకున్న చీమ‌ల శివగోపాల్ రెడ్డి..ట్రిపుల్ ఐటీలో ఇంజ‌నీరింగ్ పూర్తి కాగానే.. సివిల్స్‌పై దృష్టిపెట్టి డిల్లీలో స్టడీ సర్కిల్‌లో శిక్షణ తీసుకుని పరీక్షలకు హాజర‌య్యారు. ప్రిలిమనరీ, మెయిన్‌ ఎగ్జామినేషన్స్‌లో మంచి ప్ర‌తిభ క‌న‌ప‌రిచారు.కేంద్ర పబ్లిక సర్వీస్ కమిషన్ (UPSC)… 2019 సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ విడుద‌ల చేసిన ఫ‌లితాల్లో .. ఆల్ ఇండియాలో 263ర్యాంక్ సాధించారు చీమ‌ల శివ‌గోపాల్ రెడ్డి.

Leave a Comment