Tuesday, February 27, 2024

జేసీగా గణష్‌కుమార్‌ బాధ్యతల స్వీకరణ

వైఎస్ఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ గా జి.గణేష్ కుమార్ ఆదివారం భాద్యతలు చేపట్టారు. స్థానిక కలెక్టరేట్ లోని జేసీ ఛాంబర్లో పురోహితుల ఆశీర్వచనాలు స్వీకరించిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రభుత్వం అప్పజెప్పిన విధులు, బాధ్యతలను వంద శాతం పూర్తి చేసేలా పనిచేస్తూ జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానన్నారు. అర్హులైన అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. రెవెన్యూ, రీ సర్వే పనులు, భూ సమస్యలు, పౌర సరఫరాలు, భూసేకరణ మొదలైన ప్రధాన అంశాలతో పాటు.. అన్ని శాఖలను పటిష్టం చేస్తూ వాటి ఫలాలను లబ్ధిదారులకు అందించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. ఇందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సహకారం అందించాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular