గ్రామాల్లో పారిశుద్ధ్య సేకరణకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 21, మంది లబ్ధిదారులకు పంపిణీ పవర్‌ ఆటోలను సంయుక్త అధికారి గౌతమి పంపిణీ చేశారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఆటోలను పంపిణీ చేశారు. ఒక్కో పవర్ ఆటో విలువ రూ.2,06,272 కాగా 60 శాతం రాయితీ రూ. 1, 23, 763 పోను మిగిలిన 40 శాతం అనగా రూ. 82,509 రూపాయలు బ్యాంకు రుణం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ 2 శివారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గోపాల్, స్టెప్ సీఈవో రామచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.