జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆన్‌లైన్‌ ద్వారా ప్రవేశాలకు గడువు పెంచారు.  వాస్తవానికి ఈనెల 25వతేదీ  నాటికి గడువు ముగిసిపోగా జూన్ 10వ తేదీ వరకు గడువును పొడిగించారు. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించి మీసేవ ద్వారా రూ.50 చలానా చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని మైదుకూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ రవీంద్రనాథ్‌ తెలిపారు.  అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.  http://cceinfo.ap.gov.in అంతర్జాలంలోకి ప్రవేశించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.